
చిలకమ్మా.. మా ‘రాత’ చూడమ్మా!
పూర్వం చిలుక జోస్యంపై అందరికీ ఆసక్తి ఉండేది. చిలుక జోస్యం చెప్పేవారు ఆ వీధిలోకి వచ్చారంటే ఇంట్లో ఉన్నవారంతా వారివారి భవిష్యత్తు తెలుసుకుని సంబరపడిపోయేవారు. నేటి కంప్యూటర్ కాలంలో ఎవరికీ వాటిపై పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ.. మదిలో ఏదో ఒక మూల కొద్దిగా ఆశ కొట్టుమిట్లాడుతోంది. చిలుక జోస్యం నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ అక్కడక్కడ ప్రజలు చిలుక చెప్పింది నమ్మేస్తున్నారు. వివిధ పరీక్షల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం అనంతపురంలోని ఖాజానగర్‌లో గౌరి థియేటర్ కాంప్లెక్స్ వద్ద చిలుక జోస్యం చెప్పించుకునేందుకు ఉత్సాహం చూపారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం