Published
Fri, Jul 29 2016 12:00 AM
| Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
‘హరితహారం’లో భాగస్వాములు కావాలి
పెద్దవూర : హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ ఈసీఓ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గేమ్యానాయక్‌తండా రోడ్డు వెంట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యమని.. ఇప్పుడు మెుక్కలు నాటి సంరక్షిస్తేనే చెట్లుగా ఎదుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.పాండునాయక్, ఎంపీడీఓ రఫీఖున్నిసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రమావత్ శంకర్‌నాయక్, కార్యదర్శి డేవిడ్‌రాజు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సైదులు పాల్గొన్నారు,