గడిచిన ఏడు సంవత్సరాలుగా వస్తున్న వృద్ధాప్య పింఛనును అకారణంగా తొలగించడమే కాకుండా అధికారులు ఏకంగా ఆ వృద్ధురాలు చనిపోయినట్టు రికార్డుల్లో చూపించిన వైనమిది. కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన నల్లజర్ల వీరలక్ష్మికి 2008 నవంబర్‌లో వృద్ధాప్య పింఛను మంజూరు కాగా అప్పటి నుంచి 2015 అక్టోబర్ వరకు పింఛను తీసుకుంది. తరువాత నుంచి నిలిపివేయగా మండల అధికారులు, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం
-
రికార్డుల్లో చనిపోయినట్టు చూపిన వైనం
-
సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్న వృద్ధురాలు
కాకినాడ సిటీ :
గడిచిన ఏడు సంవత్సరాలుగా వస్తున్న వృద్ధాప్య పింఛనును అకారణంగా తొలగించడమే కాకుండా అధికారులు ఏకంగా ఆ వృద్ధురాలు చనిపోయినట్టు రికార్డుల్లో చూపించిన వైనమిది. కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన నల్లజర్ల వీరలక్ష్మికి 2008 నవంబర్‌లో వృద్ధాప్య పింఛను మంజూరు కాగా అప్పటి నుంచి 2015 అక్టోబర్ వరకు పింఛను తీసుకుంది. తరువాత నుంచి నిలిపివేయగా మండల అధికారులు, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నేటికీ సమస్యను పరిష్కరించి పింఛను పునరుద్ధరించకపోవడంతో ప్రజావాణిలో వినతి ఇచ్చేందుకు వీరలక్ష్మి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న తాను ఎవరో ఒకరి సహాయంతో అధికారుల చుట్టూ సంవత్సర కాలంగా తిరుగుతున్నా కనికరించలేదని, చనిపోయినట్టు చూపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆరు సార్లు మండలంలోని ఎండీవో కార్యాలయానికి, నాలుగుసార్లు కాకినాడలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి తిరిగానని ఇప్పటికైనా అధికారులు కనికరించి పింఛనును పునరుద్ధరించాలని కోరారు.