తుందుర్రు ఉద్యమం ప్రజలదే | people fighting aginast acqa park | Sakshi
Sakshi News home page

తుందుర్రు ఉద్యమం ప్రజలదే

Published Mon, Oct 17 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

తుందుర్రు ఉద్యమం ప్రజలదే

తుందుర్రు ఉద్యమం ప్రజలదే

భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం 25 గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు చేపట్టినదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు.

– రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సాగుతోంది
– ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తించాలి
– రెండున్నరేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తుంటే సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు
– తుందుర్రు పరిసరాల్లో పరిస్థితి మిలటరీ పాలనను తలపిస్తోంది
 
పాలకొల్లు టౌన్‌ :
భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం 25 గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు చేపట్టినదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీయో చేపట్టినది కాదని ఏ రాజకీయపార్టీయో లబ్ధికోసం చేపట్టిన ఉధ్యమం కాదని సిఎం చంద్రబాబు నాయుడు గమనించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. పాలకొల్లు కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనం నందు ఈ నెల 19వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తుందుర్రు తదితర గ్రామాల ప్రజలను కలిసి వారి భాదలు, ఇబ్భందులను తెలుసుకుని ఓదార్చడానికి వస్తున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షత వహించారు. తుందుర్రు ప్రజల సమస్యల్లో ఇబ్భందుల్లో వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. రెండున్నర సంవత్సరాలుగా తుందుర్రు పరిశర గ్రామాల ప్రజలు ఆక్వా పుడ్‌ పార్కు నిర్మాణం జరిగితే అందులో నుండి వచ్చే కాలుష్యం వల్ల వేలాది ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు దెబ్బతింటాయని భవిష్యత్‌లో భూగర్భ జలాలు పాడై తాగడానికి కూడా నీరు దొరకని పరస్థితి ఏర్పడుతుందని ఈ ఉధ్యమంఆ ప్రాంత ప్రజలు చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వంప్రజా సమస్యలను పక్కన పెట్టి తుందురు గ్రామంలో 144 సెక్షన్‌ విదించి ఆందోళన కారులను, ప్రజలను జైళ్లకు పంపించి మిలట్రీ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రస్తుతం తుందుర్రు గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే ఏదో ఒక గుర్తింపు కార్డు పోలీసులకు చూపించి బయటకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉండడం దారుణమన్నారు. ఇటీవల ఏలూరు వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలవడానికి తుందుర్రు గ్రామ మహిళలు శుభకార్యాలకు వెళుతున్నామని పోలీసులకు చెప్పి దొంగచాటున వచ్చి జగన్‌ను కలిసి వారి గోడు వెళ్లబుచ్చారని నాని తెలిపారు. దీనిపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత పాలనలో ఉన్నామా అని మహిళల గోడును అర్థం చేసుకుని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులతో కమిటీ ఏర్పాటుచేసి తుందుర్రు పర్యటించడం జరిగిందన్నారు. ఆ నివేదికను అక్కడి వాస్తవ పరిస్తితులను జగన్‌కు తెలపడంతో ఆయన తుందుర్రు పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపద్యంలో కొత్త పరిశ్రమలు రావాలని ఇందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి మద్దతు ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యల పరిష్కారానికి ఉధ్యమాలు చేపడుతుంటే అభివద్దికి అడ్డంకు అంటూ సిఎం చంద్రబాబు నాయుడు అవాస్తవ ప్రకటనలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు తుందుర్రు ప్రజల ఆందోళన అర్థం చేసుకోకుండా వారి సమస్యలను తెలుసుకోకుండా ప్యాక్టరీ నిర్మాణం వలన కాలుష్యం ఉండదని ప్రకటనలు చేసారు. అయితే సిఎం చంద్రబాబు నాయుడు ప్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసే విదంగా ప్రభుత్వం 11 కోట్లు నిధులు కేటాయిస్తుందని ప్రకటన చేయడం అక్కడ వాస్తవ పరిస్థితికి అర్థం పడుతుందని నాని స్పష్టం చేసారు. ప్రై వేటు వ్యక్తులు నిర్మించే ఆక్వా పుడ్‌ పార్కుకు ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పోగ్రామం కన్వీనర్‌ తలసిల రఘురాం, పాలకొల్లు నియోజకవర్గ అధనపు సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, నియోజకవర్గ పరిశీలకుడు బలగం సేతుబందన సీతారాం, మండల పార్టీ కన్వీనర్‌లు గుణ్ణం సర్వారావు, పొత్తూరి బుచ్చిరాజు, మైఖేల్‌రాజు, దొమ్మేటి ఏడుకొండలు, ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, అనిశెట్టి సూరమ్మ, కర్ని జోగయ్య, పి వీరాస్వామి, పాలపర్తి ఇమ్మానియోలు, చిట్టూరి ఏడుకొండలు, ఖండవల్లి వాసు, మద్దా చంద్రకళ, పి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
భీమవరం అర్బన్‌:
ఈ నెల 19న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోçßæన్‌ రెడ్డి  మెగా ఫుడ్‌ పార్కు బాధిత భీమవరం, నరసాపురం మండలాల్లోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిరోడ్‌ మ్యాప్‌ను ప్రొగ్రామింగ్‌ ఇన్‌ఛార్జి తలశీల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్‌ఎల్‌సీ మేకా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిరాష్ట్రంలో ఎక్కడ ఆప§∙గాని, అన్యాయాలు, అక్రమాలు జరిగి]∙వారికి న్యాయం జరిగేవరకు వారి పక్షాన పోరాడుతున్నారన్నారు. అటువంటి ప్రజాధరణ కలిగిన వైఎస్‌ జగన్మోçßæన్‌రెడ్డి మనమంతా అండగా నిలబడాలన్నారు. ఎమ్‌ఎల్‌సీ మేకా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త, శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం రోడ్‌మ్యాప్, ఏర్పాట్లపై కార్యకర్తలు,నాయకులతో సమీక్షించారు.     మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, పట్టణ కన్వీనర్‌ కోడే యుగంధర్, మండల కన్వీనర్‌ తిరుమాని ఏడుకొండలు, పాలకొల్లు మునిసిపల్‌ ప్రతిపక్ష నాయకులు యడ్ల తాతాజీ, మద్దాల సత్యనారాయణ, కాండ్రేకుల నరసింహరావు, జడ్డు నరసింహరావు (తాతారావు), పాళి బాబులు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement