acqa food park
-
పల్లెలపై ప్రతాపం
తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసుల దమనకాండ భారీగా మోహరింపు 144 సెక్షన్ కొనసాగింపు ఇంటికో పోలీస్ భయం గుప్పెట ప్రజలు గడపదాటేందుకూ వణుకు ఎక్కడ చూసినా ఖాకీలే ఆక్వా ఫుడ్‌పార్క్‌కు నిర్మాణ సామగ్రి తరలింపు కోసం తుందుర్రు పరిసర గ్రామాల్లో శుక్రవారం పోలీసులు భయోత్పాతం సృష్టించారు. లాఠీలు, తుపాకులు చేతబట్టి ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. బూటుచప్పుళ్లతో భీతావహ వాతావరణాన్ని తలపించారు. ప్రజలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధించారు. ఫలితంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే మగ్గారు. యుద్ధసామగ్రి తరలింపును తలపించేలా ఆక్వాఫుడ్‌పార్క్‌కు కంటెయినర్లలో సామగ్రిని దగ్గరుండి భారీబందోబస్తు మధ్య తరలించారు. నరసాపురం, నరసాపురం రూరల్ /భీమవరం : నరసాపురం మండలం కె.బేతపూడి, భీమవరం మండలం తుందుర్రు గ్రామాల మధ్యలో ఉన్న పల్లెల్లో శుక్రవారం పోలీసులు బీభత్సం సృష్టించారు. ప్రతి ఇంటి వద్దా మోహరించారు. ప్రజలను గడపదాటనివ్వలేదు. తుందుర్రులోని ఆక్వా ఫుడ్‌ఫ్యాక్టరీకి సామగ్రి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం జరిగిన పోలీసుల దమనకాండకు నిరసనగా ప్రదర్శనకు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నిర్ధాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందంటూ భయోత్పాతం సృష్టించారు. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే నిలబడి కంటెయినర్ల తరలింపును చూస్తూ ఉండిపోయారు. యుద్ధ యంత్రాలు తరలించినట్టుగా.. ఉదయం 11 గంటల నుంచీ యంత్రాలతో కంటెయినర్లు తుందుర్రు ఫ్యాక్టరీ వైపు బయలుదేరాయి. వీటిని భారీ బందోబస్తు మద్య పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేర్చారు. మత్స్యపురి నుంచి తుందుర్రు వరకూ భారీగా మొహరించారు. ఒక్కో కంటైనర్ వెనుకా ఓ డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మొత్తం వంద మంది సిబ్బంది కంటెయినర్ల తరలింపులో నిమగ్నమయ్యారు. వీరుకాక అడుగడుగునా మోహరించేందుకు 800 మంది సిబ్బందిని వినియోగించినట్టు సమాచారం.వీరిని రాజధాని, అమరావతి, కృష్ణాజిల్లా నుంచి రప్పించినట్టు తెలుస్తోంది. ఇదంతా యుద్ధ సామగ్రి తరలింపు ప్రక్రియను తలపించింది. వీరవాసరం, మత్స్యపురి మీదుగా ఈ కంటెయినర్లను తరలించారు. అడుగడుగునా తనిఖీలు కంటెయినర్ల తరలింపు సందర్భంగా పోలీసులు గ్రామాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగించారు. దీంతో పనులపై బయలుదేరిన వారు వాయిదాలు వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. నిరసనపైనా ఉక్కుపాదం.. గురువారం నాటి పరిణామాలకు నిరసనగా శుక్రవారం నరసాపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు మంతెన సీతారామ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ సెంటర్లో ఆందోళన చేసే యత్నం చేశారు. అయితే అక్కడికి సిబ్బందితో కలిసి చేరుకున్న టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్ ఆందోళన విరమించాలని సూచించారు. దీనికి నిరసనకారులు అంగీకరించకపోవడంతో సీతారామ్తోపాటుగా తెలగంశెట్టి సత్యనారాయణ , బూడిద జోగేశ్వరరావు తదితరులను పోలీసులు లాక్కెళ్లి జీపులో పడేసి స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఉదయంపూట ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ, సీపీఎం నాయకుడు పొన్నాడ రాములను ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. పక్కా పోలీస్ వ్యూహం యంత్రాలను ఫ్యాక్టరీలోకి తరలించడానికి పోలీసులు పక్కా వ్యూహంతో పని చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం నుంచే ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక కమిటీ నాయకులను, ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మరికొంత మంది ముఖ్య నాయకులు పోలీసులకు చిక్కలేదు. దీంతో ఆ నాయకుల ఆధ్వర్యంలో గురువారం యంత్రాల తరలించే సమయంలో ఆందోళన జరిగింది. తోపులాటల్లో కొందరు కారం చల్లడం, కిరోసిన్ క్యాన్లు తీసుకురావడంతో సీన్ మారిపోయింది. దీనిని బూతద్దంలో చూపించి పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమకారులు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని పోలీసులు 353, 307, 143, 149, 108 తదితర బలమైన సెక్షన్లతో 14 మంది కీలక నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మరికొంతమందిని చేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా ఒకరోజు ముందు అదుపులోకి తీసుకున్న వారిపైనా పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఇలా బయట నాయకులు లేకుండా చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేయడం ద్వారా ఫ్యాక్టరీలోకి యంత్రాలను పంపగలిగారు. -
తుందుర్రు ఉద్యమం ప్రజలదే
-
తుందుర్రు ఉద్యమం ప్రజలదే
– రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సాగుతోంది – ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తించాలి – రెండున్నరేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తుంటే సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు – తుందుర్రు పరిసరాల్లో పరిస్థితి మిలటరీ పాలనను తలపిస్తోంది పాలకొల్లు టౌన్ : భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం 25 గ్రామాలకు చెందిన వేలాది ప్రజలు చేపట్టినదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీయో చేపట్టినది కాదని ఏ రాజకీయపార్టీయో లబ్ధికోసం చేపట్టిన ఉధ్యమం కాదని సిఎం చంద్రబాబు నాయుడు గమనించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. పాలకొల్లు కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనం నందు ఈ నెల 19వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తుందుర్రు తదితర గ్రామాల ప్రజలను కలిసి వారి భాదలు, ఇబ్భందులను తెలుసుకుని ఓదార్చడానికి వస్తున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షత వహించారు. తుందుర్రు ప్రజల సమస్యల్లో ఇబ్భందుల్లో వైయస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములై వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. రెండున్నర సంవత్సరాలుగా తుందుర్రు పరిశర గ్రామాల ప్రజలు ఆక్వా పుడ్ పార్కు నిర్మాణం జరిగితే అందులో నుండి వచ్చే కాలుష్యం వల్ల వేలాది ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు దెబ్బతింటాయని భవిష్యత్‌లో భూగర్భ జలాలు పాడై తాగడానికి కూడా నీరు దొరకని పరస్థితి ఏర్పడుతుందని ఈ ఉధ్యమంఆ ప్రాంత ప్రజలు చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వంప్రజా సమస్యలను పక్కన పెట్టి తుందురు గ్రామంలో 144 సెక్షన్ విదించి ఆందోళన కారులను, ప్రజలను జైళ్లకు పంపించి మిలట్రీ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రస్తుతం తుందుర్రు గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే ఏదో ఒక గుర్తింపు కార్డు పోలీసులకు చూపించి బయటకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉండడం దారుణమన్నారు. ఇటీవల ఏలూరు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తుందుర్రు గ్రామ మహిళలు శుభకార్యాలకు వెళుతున్నామని పోలీసులకు చెప్పి దొంగచాటున వచ్చి జగన్‌ను కలిసి వారి గోడు వెళ్లబుచ్చారని నాని తెలిపారు. దీనిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత పాలనలో ఉన్నామా అని మహిళల గోడును అర్థం చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కమిటీ ఏర్పాటుచేసి తుందుర్రు పర్యటించడం జరిగిందన్నారు. ఆ నివేదికను అక్కడి వాస్తవ పరిస్తితులను జగన్‌కు తెలపడంతో ఆయన తుందుర్రు పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపద్యంలో కొత్త పరిశ్రమలు రావాలని ఇందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి పూర్తి మద్దతు ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యల పరిష్కారానికి ఉధ్యమాలు చేపడుతుంటే అభివద్దికి అడ్డంకు అంటూ సిఎం చంద్రబాబు నాయుడు అవాస్తవ ప్రకటనలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు తుందుర్రు ప్రజల ఆందోళన అర్థం చేసుకోకుండా వారి సమస్యలను తెలుసుకోకుండా ప్యాక్టరీ నిర్మాణం వలన కాలుష్యం ఉండదని ప్రకటనలు చేసారు. అయితే సిఎం చంద్రబాబు నాయుడు ప్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసే విదంగా ప్రభుత్వం 11 కోట్లు నిధులు కేటాయిస్తుందని ప్రకటన చేయడం అక్కడ వాస్తవ పరిస్థితికి అర్థం పడుతుందని నాని స్పష్టం చేసారు. ప్రై వేటు వ్యక్తులు నిర్మించే ఆక్వా పుడ్ పార్కుకు ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పోగ్రామం కన్వీనర్ తలసిల రఘురాం, పాలకొల్లు నియోజకవర్గ అధనపు సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, నియోజకవర్గ పరిశీలకుడు బలగం సేతుబందన సీతారాం, మండల పార్టీ కన్వీనర్లు గుణ్ణం సర్వారావు, పొత్తూరి బుచ్చిరాజు, మైఖేల్‌రాజు, దొమ్మేటి ఏడుకొండలు, ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, అనిశెట్టి సూరమ్మ, కర్ని జోగయ్య, పి వీరాస్వామి, పాలపర్తి ఇమ్మానియోలు, చిట్టూరి ఏడుకొండలు, ఖండవల్లి వాసు, మద్దా చంద్రకళ, పి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. భీమవరం అర్బన్: ఈ నెల 19న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోçßæన్ రెడ్డి మెగా ఫుడ్ పార్కు బాధిత భీమవరం, నరసాపురం మండలాల్లోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిరోడ్ మ్యాప్‌ను ప్రొగ్రామింగ్ ఇన్‌ఛార్జి తలశీల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్ఎల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిరాష్ట్రంలో ఎక్కడ ఆప§∙గాని, అన్యాయాలు, అక్రమాలు జరిగి]∙వారికి న్యాయం జరిగేవరకు వారి పక్షాన పోరాడుతున్నారన్నారు. అటువంటి ప్రజాధరణ కలిగిన వైఎస్ జగన్మోçßæన్‌రెడ్డి మనమంతా అండగా నిలబడాలన్నారు. ఎమ్ఎల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త, శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం రోడ్‌మ్యాప్, ఏర్పాట్లపై కార్యకర్తలు,నాయకులతో సమీక్షించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, పాలకొల్లు మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు యడ్ల తాతాజీ, మద్దాల సత్యనారాయణ, కాండ్రేకుల నరసింహరావు, జడ్డు నరసింహరావు (తాతారావు), పాళి బాబులు తదితరులు ఉన్నారు. -
ఈ దాష్టీకం ఇంకెంత కాలం..?
– ఆక్వా పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై కొనసాగుతున్న వేధింపులు – సెక్షన్ 144 ఎత్తివేతపై మీనమేషాలు – ప్రభుత్వ ఒత్తిడితోనే కొనసాగుతున్న పోలీస్ క్యాంపులు – ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు విపక్షాల యోచన సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఈ వేధింపులు ఎంతకాలం. మమ్మల్ని భయపెట్టి ఫ్యాక్టరీ కట్టినా ఆ తర్వాత నిర్వహించగలరా? పోలీసుల మోహరింపుతో ఎంతకాలం ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుంది..... ఇది స్థానిక గ్రామాల ప్రజల వాదన. దీనికి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. తమను పోలీసులు వేధిస్తున్నా, అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తున్నా తమకు అండగా నిలబడని అధికార పక్షంపై స్థానిక ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చిన నేతలు తమకు ఇబ్బంది కలిగిన సమయంలో తమకు అండగా నిలబడకుండా ముఖ్యమంత్రికి దాసోహం కావడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం కాదని మరోసారి రుజువయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుందుర్రు ఫ్యాక్టరీ విషయంలో ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం విమర్శలకు దారి తీస్తోంది. అక్కడ నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వాఫుడ్ పార్కును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం పేరుతో తుందుర్రు, జొన్నల గరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో గత నెల రోజులుగా 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల్లో అక్కడ ప్రజలు పడని ఇబ్బందులు లేవు. 144 సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని పోలీసులు చేసిన అరాచకాలపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే సరికి పోలీసుల సంఖ్యను తగ్గించినా 144 సెక్షన్ ఎత్తివేతపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు.హత్యాయత్నం, బైండోవర్ కేసులతో మూడు గ్రామాల ప్రజలను భయబ్రాంతులను చేశారు. 37 మందిపై హత్యాయత్నం కేసు పెట్టి ఏడుగురిని జైల్లో పెట్టారు. వారికి బెయిల్ రాకుండా పదేపదే అడ్డుతగులుతున్నారు మరోవైపు 120 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మగవారు గ్రామంలో అడుగుపెట్టడానికే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. బయట అజ్ఞాతంలో ఉన్న వారి కోసం రోజూ ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితులు నేటికీ ఉన్నాయి. దీంతో కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. భర్తలు అజ్ఞాతంలో, భార్యలు గ్రామాల్లో ఉండాల్సిన స్థితి ఇంకా కొనసాగుతోంది. ఫుడ్‌పార్కు నిర్మాణంపై ప్రజల్లో రోజురోజుకీ అపోహలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యలో వారికి అవగాహన కల్పించేందుకు సిద్దం అని యాజమాన్యం ప్రకటించినా రెవిన్యూ విభాగం నుంచి స్పందన కరువైంది. ఫ్యాక్టరీపై ప్రజల్లో అపోహలు వచ్చినప్పుడే రెవిన్యూ, పొల్యూషన్ కంట్రోల్ విభాగాలు ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నాలు పూర్తిస్థాయిలో చేయలేదు. ఏదో మండల కార్యాలయాల్లో పెట్టి మమ అనిపించారు. నిర్బంధంతో అణిచివేయాలని చూడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ నిర్బందాన్ని వెంటనే ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనానీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్లను కలిసి 144 సెక్షన్ ఎత్తివేయాలని, అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించినా ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఉద్యమాన్ని ఉదతం చేసేందుకు విపక్షాలు ప్రణాళిక సిద్దం చేస్తున్నాయి. -
నేడు ఆక్వాఫుడ్‌పార్క్ కాలుష్యంపై సదస్సు
భీమవరం: ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణం కాలుష్యం పర్యావరణాలపై ప్రభావం అనే అంశంపై గొంతేరు కాలువ పరిరక్షణ కమిటీ, భీమవరం పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదిన సదస్సు నిర్వహించనున్నట్లు జల్లి రామ్మోహనరావు, ఎం శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమవరం పట్టణంలోని ఛాంబర్ఆఫ్కామర్స్ భవనంలో నిర్వహించే సదస్సుకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్ ఎంవీవీఎస్ స్వామి, బ్రహ్మజీరావు, పర్యావరణవేత్తలు వెలగ శ్రీనివాస్, పి మురళీకష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. ఈసదస్సుకు పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రామ్మోహనరావు, శ్రీనివాస్ కోరారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
భీమవరం : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం తక్షణం నిలిపి వేయాలని, అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో ప్రభుత్వ, పార్కు యాజమాన్య దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ కార్యదర్శి బి.సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును ఆరెంజ్ క్యాటగిరీలో చేర్చామని చుక్కనీరు కూడా గొంతేరు డ్రై యిన్‌లో కలవదని ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభ సందర్భంలో ప్రకటించిన సబ్‌కలెక్టర్ వందల కోట్ల రూపాయల ఖర్చుతో సముద్రంలోకి ప్రత్యేకSపైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఫ్యాక్టరీకి అనుకూలంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫుడ్ పార్కు పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గాదిరాజు వెంకటసుబ్రహ్మణ్యంరాజు, సీపీఐ నాయకుడు మల్లుల సీతారామ్ ప్రసాద్, చేబోలు సత్యనారాయణ, ధనికొండ శ్రీనివాస్, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఏలూరు (సెంట్రల్) : ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక పవర్‌పేటలోని సీపీఎం కార్యాలయం నుంచి వసంతమహల్ వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న మోగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల రెండు మండలాల గ్రామాల్లో మంచినీరు కలుషితమై భవిష్యత్‌లో తాగునీరు దొరకని పరిస్థితి వస్తుందని, పంట భూములు పాడైపోతాయన్నారు. ఇంతలా ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయటం కోసం ప్రజలను పణంగా పెడుతుందని ఆయన విమర్శించారు. ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలను అరెస్ట్ చేయడాన్ని సీతారామ్ ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత గుడిపాటి నరసింహారావు, డీఎన్‌వీడీ ప్రసాద్, కె.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.