ఆరు ఘాట్‌లకే అనుమతి | permisson for six ghats | Sakshi
Sakshi News home page

ఆరు ఘాట్‌లకే అనుమతి

Published Fri, Jul 29 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

యలమంచిలి : మండలంలోని లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ పుష్కరఘాట్‌లలో మాత్రమే అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్‌ చాగలకొండు గురు ప్రసాదరావు, ఎస్సై పాలవలస అప్పారావు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు.

యలమంచిలి : మండలంలోని లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ పుష్కరఘాట్‌లలో మాత్రమే అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్‌ చాగలకొండు గురు ప్రసాదరావు, ఎస్సై పాలవలస అప్పారావు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. ఆ ఘాట్‌లలో మాత్రమే పోలీసులు, అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. మిగిలిన కనకాయలంక, పెదలంక, ఏనుగువానిలంక, యలమంచిలిలంక, గంగడుపాలెం, కంచుస్తంభంపాలెం, బాడవ గ్రామాలలోని పుష్కరఘాట్‌లలో ఎటువంటి వసతులు కల్పించడం లేదన్నారు. ఈ ఘాట్‌లలో పుష్కర స్నానాలను నిషేధించామని, యాత్రికులెవరూ ఈ ఘాట్లలో స్నానాలు చేయవద్దని వారు హెచ్చరించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement