వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Tue, Nov 1 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
ఉండి : ఓ వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం వాండ్రం గ్రామానికి చెందిన కొట్టు హనుమంతరావు(22) గ్రామంలో చేపల చెరువుపై పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల ముందు చేపల పట్టుబడి త్వరగా అయిపోవడంతో గ్రామంలో స్నేహితుడైన పర్వతాల రాధాకృష్ణ వద్దకు హనుమంతరావు వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ డీజిల్ దొంగతనం జరగడంతో తనపై నింద వస్తుందనే భయంతో హనుమంతరావు ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కొడుకుది ఆత్మహత్య కాదని, అనుమానంగా ఉందని మృతుడు తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఎం.రవివర్మ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement