పీజీ ఎంట్రన్స్‌లో ఆచార్య ఎన్జీ రంగా విద్యార్థుల ప్రతిభ | pg students good results | Sakshi

పీజీ ఎంట్రన్స్‌లో ఆచార్య ఎన్జీ రంగా విద్యార్థుల ప్రతిభ

Jul 20 2016 12:43 AM | Updated on Jun 4 2019 5:16 PM

ఆచార్య ఎన్‌జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్‌టెస్ట్‌లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు చెందిన కొవ్వూరి సరిత ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ప్రథమర్యాంకు, రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించింది. ఆ వివరాలను కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.జయరామిరెడ్డి మంగళవారం తెలిపారు

కంబాలచెరువు : ఆచార్య ఎన్‌జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్‌టెస్ట్‌లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు చెందిన కొవ్వూరి సరిత ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ప్రథమర్యాంకు, రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించింది. ఆ వివరాలను కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.జయరామిరెడ్డి మంగళవారం తెలిపారు. పి.శ్రీదేవి రాష్ట్రస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, బిన్సీథిమస్‌ 11వ ర్యాంకు, ఎం.దేవి 19వ ర్యాంకు సాధించారు. ఎస్టీ విభాగంలో సోమాల కార్తీక్‌ రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించాడు. అలాగే మొత్తం 40 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 33 మంది అర్హత సాధించారన్నారు. వీరిలో 50 ర్యాంకుల్లోపు 12 మంది, 100 ర్యాంకుల్లో 18 మంది సాధించారు. ఉత్తమర్యాంకులు సా«ధించిన విద్యార్థులను అసోసియేట్‌ డీన్‌ జయరామిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. 
జాతీయస్థాయిలోనూ హవా
రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన పీజీ ఎంట్రన్స్‌ పోటీల్లో ర్యాంకులు సాధించారని డీన్‌ జయరామిరెడ్డి తెలిపారు. సుమారు 12 మంది విద్యార్థులు గుజరాత్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోగల వ్యవసాయ కళాశాలల్లో సీట్లు సాధించారన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement