ఫోన్ పరిచయంతో మైనర్ బాలిక ఇంత దూరం.. | phone relation gets vizag girl cheated | Sakshi
Sakshi News home page

ఫోన్ పరిచయంతో మైనర్ బాలిక ఇంత దూరం..

Published Fri, Sep 16 2016 10:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

phone relation gets vizag girl cheated

సికింద్రాబాద్‌: ఫోన్‌లో పరిచయమైన యువకుడు తనను నిజంగానే పెళ్లి చేసుకుంటాడని భావించి విశాఖపట్నానికి చెందిన ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి నగరానికి చేరుకుంది.   ఆర్‌పీఎఫ్‌ పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌కు చెందిన 10వ తరగతి చదువుతున్న బాలికకు హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఫోన్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌కు వస్తే వివాహం చేసుకుంటానని చెప్పాడు.

అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఉన్న తల్లి బంగారు నెక్లెస్, చెవిదిద్దులు, వెండి ఆభరణాలు, రూ. 3 వేలు నగదు, ఎనిమిది జతల బట్టలు తీసుకుని రైల్లో నగరానికి చేరుకుంది. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలికను చైల్డ్‌ హెల్ప్‌డెస్క్‌ ప్రతినిధులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టింది. హెల్ప్‌డెస్క్‌ కౌన్సెలర్‌ సుమలత సమాచారం మేరకు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నింబోలిఅడ్డలోని బాలికల వసతిగృహంలో బాలికకు ఆశ్రయం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement