చెత్త కుప్ప.. ఆదాయం గొప్ప | pile of garbage.. Income great | Sakshi
Sakshi News home page

చెత్త కుప్ప.. ఆదాయం గొప్ప

Published Mon, Jul 25 2016 12:21 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

చెత్త కుప్ప.. ఆదాయం గొప్ప - Sakshi

చెత్త కుప్ప.. ఆదాయం గొప్ప

  • పాలకవర్గం, అధికారులు దృష్టి సారిస్తే మరింత ఆదాయం
  • అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల.. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా.. సమాజంలో ప్రజలు వినియోగించే ప్రతి వస్తువును తిరిగి ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు. నిత్యం ఇళ్లలో వెలువడే చెత్తను ఊరికి పారేయకుండా పోగు చేసుకుంటే ఆర్థిక లాభాలు ఉంటాయని ఇప్పుడు గ్రేటర్‌ వరంగల్‌ పారిశుద్ధ్య కార్మి కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అమలువుతున్న తడిపొడి చెత్త సేకరణ, ఆదాయ మార్గాలపై ప్రత్యేక కథనం.
     
    వరంగల్‌ అర్బన్‌ : ప్రస్తుత కాలంలో సగటు మానవుడి జీవితం యంత్రమయంగా మారింది. ప్రతి పనికి ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కాగితపు వినియోగం పెరిగిపోయింది. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్‌లోకి రోజురోజుకు కొత్త వస్తువులు ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రోజు నివాసాల్లో వెలువడే చెత్తతో పాటు పాత వస్తువులు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా ఇళ్లలో ఏడాదికి టన్నుల కొద్ది చెత్త పోగవుతోంది. అయితే పనికిరాదని పడేస్తున్న చెత్తను ప్రక్షాళన చేస్తుండడం ద్వారా బల్దియా పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కలుగుతోంది. 
     
    రోజు 180 మెట్రిక్‌ టన్నుల చెత్త డంపింగ్‌
    వరంగల్‌ మహా నగరపాలక సంస్థ 400 చదరపు కిలోమీటర్లకు పైచిలుకు విస్తరించింది. గ్రేటర్‌ పరిధిలో 10 లక్షలకు పైచిలుకు జనాభా నివసిస్తున్నారు. వీరంతా నిత్యం ప్లాస్టిక్‌ వస్తువులు, కాగితం, సీసాలు, ఎలక్ట్రానిక్, ఇనుము విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో నగరం నుంచి ప్రతిరోజు మడికొండ డంపింగ్‌ యార్డుకు 160 నుంచి 180 మెట్రిక్‌ టన్నుల చెత్త చేరుతోంది. 2000లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని నగరాల్లో ఘనవ్యర్థాల యాజమాన్యం పేరుతో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందిం చింది. కాగా, 2012 అక్టోబర్‌లో ఆ నిబంధనలు వరంగల్‌ క్లిన్‌సిటీ పేరుతో కార్యరూపం దాల్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ బదిలీకావడంతో కార్యాచరణ క్రమేపీ నీరుగారింది. 2015 నవంబర్‌లో ఖమ్మం జిల్లా ఐటీసీ లిమిటెడ్‌ సామా జిక బాధ్యతగా శ్రీఫౌండేషన్, గ్రేటర్‌ వరంగల్‌ అధికార యంత్రాంగంతో కలిసి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఫలి తాలు సాధిస్తోంది. 
     
    1.40 లక్షల కుటుంబాలకు అవగాహన
    గత ఏడాది నవంబర్‌ నుంచి శ్రీఫౌండేషన్, బల్దియా అధికారులు కలిసి గ్రేటర్‌ పరిధిలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎల్‌ఎఫ్‌ మహిళలు 18 మందికి శిక్షణ ఇచ్చారు. అనంతరం 18 డీఆర్‌సీ సెంటర్ల ద్వారా పొడి చెత్త కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సుమారు 1.40 లక్షల కుటుంబసభ్యులకు అవగాహన కల్పిం చారు. అలాగే 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు పొడి, తడి చెత్త సేకరణలో సుశిక్షితులుగా తీర్చిదాద్దారు. 
     
    పర్యావరణానికి దోహదం
    ఇంటిలో ప్రతి రోజు వెలువడే చెత్తలో ఎక్కువ శాతం పొడి చెత్తనే ఉంటుంది. ఇందులో ప్లాస్టిక్‌ కవర్లు, చిత్తు కాగితాలే అధికంగా ఉంటాయి. వీటిని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతోంది. ఇవే కాకుండా పాత ప్లాస్టిక్‌ డబ్బాలు, సీసాలను రోజు వారీగా సేకరించి డీఆర్‌సీ సెంటర్లలో విక్రయిస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో ఆయా డీఆర్‌సీ సెంటర్లలో 420 మెట్రిక్‌ టన్నుల పొడి చెత్తను కొనుగోలు చేశారు. ఇందులో పొడి చెత్తను రూ. 21 లక్షలకు విక్రయించారు. దీంతో సుమారు 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూ రింది. అలాగే డీఆర్‌సీ సెంటర్లలో పొడిచెత్త తూకం వేస్తున్న 18 మంది మహిళలు నెలకు ఒకరు మార్జిన్‌ మనీగా రూ.5 నుంచి 6 వేల ఆదాయం పొందుతున్నారు. వివిధ కంపెనీల నిర్వాహకులు పొడి చెత్తను కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు.
     
    బల్దియా దృష్టి సారిస్తే రూ. కోట్ల ఆదాయం
    గ్రేటర్‌ పరిధిలో నిత్యం 160 నుంచి 180 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రధానంగా ట్రైసిటీలోని హన్మకొండ, కాజీ పే ట, వరంగల్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇందులో కేవలం రెండు మెట్రిక్‌ టన్నుల చెత్తను మాత్రమే ఆయా డీఆర్‌సీ సెంటర్లలో విక్రయిస్తున్నారు. అంటే సుమారు రెండు టన్నుల చెత్తకు రూ.10 వేల ఆదాయం పొందుతున్నారు. వాస్తవంగా 36 టన్నుల పొడి చెత్తను సేకరించడం ద్వారా రోజు 1.70 లక్షల ఆదాయం పొందవచ్చు. అంటే సగటున రోజు ఆదాయం వచ్చే 34 మెట్రిక్‌ టన్నుల చెత్తను మడికొండ డంపింగ్‌ యార్డులోని గుట్టల్లో వృథాగా కలిపేస్తున్నారు. నగరవాసులకు తడి, పొడి చెత్తపై కొరవడిన అవగాహన, అధికారుల నిర్లక్ష్యం, కొంత మంది బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది అలసత్వంతో చెత్త సేకరణ విజయవంతం కావడం లేదని తెలుస్తోంది. కాగా, మడికొండ డంపింగ్‌ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయి వాతావారణ కాలుష్యాన్ని దెబ్బతీస్తుందని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. అంతేకాకుండా బల్దియాకు నిత్యం వాహనాల ద్వారా చెత్త తరలింపు వ్యయం పెనుభారంగా మారుతోంది. బల్దియా పాలకులు, అధికారులు దృష్టి సారించి ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తే రూ.కోట్ల లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
     
    ప్రజల సహకారంతో విజయవంతం
    తడి, పొడి చెత్త సేకరణ సామాజిక బాధ్యతతో చేపడుతున్నాం. తడి, పొడి చెత్తను ఇళ్లలోనే వేర్వేరు సంచుల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలి. 1.40 లక్షల ఇళ్లల్లో పొడి చెత్త కోసం సంచులను అందజేశాం. నగరంలో ఇప్పటివరకు 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పొడి చెత్త కొనుగోలుకు ప్రస్తుతం 18 డీఆర్‌సీలు ఉన్నాయి. మరో 12 సెంటర్లను బల్దియా ఏర్పా టు చేస్తోంది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తే కార్యక్రమం విజయవంతమవుతోంది. 
    –గొడిశాల రమేష్, పొడి చెత్త ఆపరేషన్‌ మేనేజర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement