
శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ
శెట్టూరు(లక్ష్మంపల్లి): మండల పరిధిలోని లక్ష్మంపల్లి జెడ్పీ హైస్కూల్ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి నీరు పైకి ఎగజిమ్ముతూ ఫౌంటెయిన్‌ను తలపించింది. సాయంత్రానికి సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసినా అప్పటికే చాలా నీరు వృథాగా పోయింది. తరచూ ఇలా జరుగుతున్నా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లీకేజీ వల్ల పలు గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు.