ఏలూరు స్మార్ట్‌ సిటీ కోసం ప్రణాళిక | plan for eluru smart city | Sakshi
Sakshi News home page

ఏలూరు స్మార్ట్‌ సిటీ కోసం ప్రణాళిక

Aug 25 2016 10:04 PM | Updated on Sep 4 2017 10:52 AM

ఏలూరు స్మార్ట్‌ సిటీ కోసం ప్రణాళిక

ఏలూరు స్మార్ట్‌ సిటీ కోసం ప్రణాళిక

ఏలూరు (మెట్రో): ఏలూరును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.740 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వం నుండి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు.

ఏలూరు (మెట్రో): ఏలూరును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.740 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వం నుండి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ భాస్కర్‌ను సీమెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి బృందం కలుసుకున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ యర్రా సాయి శ్రీకాంత్‌కు ప్రాజెక్టు నివేదికను సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. పురాతనమైన హేలాపురి నగరాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఎందరో అభివృద్ధి చేయాలని సంకల్పించారని, నిధుల కొరతతో ఆశించిన ఫలితం సాధించలేకపోయారన్నారు. కలెక్టర్‌ కె.భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement