నిర్వాసితుల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
నాలుగు మండలాల కార్యకర్తలతో సమావేశం
కూనవరం : పోలవరం నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. నాలుగు మండలాల కార్యకర్తల సమావేశాన్ని శనివారం పెదార్కూరులో నిర్వహించారు. సర్పంచ్ పాయం మధు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలవరం ముంపుతో సర్వం కోల్పోయి నిరాశ్రయులవుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 18 నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు నష్టపరిహారం విషయంలో నిర్వాసితులను దగా చేస్తున్నారన్నారు. ఆర్‌ఆర్ ప్యాకేజీ భూ నష్ట పరిహారం, పునరావాసం, భూమికి భూమి సేకరణ,18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ముందస్తుగా ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు.
కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. జగన్Sమోహన్‌రెడ్డిని సీఎంని చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పని చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం విలీన మండలాల్లో రెండో విడత గడపగడపకూ వైఎస్సార్ నిర్వహించాలన్నారు. అనంతరం మండల, బూత్ కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. సర్పంచ్ పాయం మధు,మాజీ ఎంపీపీ పాయం వెంకయ్య, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఎస్కే కిస్మత్, వీఆర్‌పురం మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి ముత్యాల మురళి, యూత్ నాయకుడు చిక్కాల బాలు, కోటం జయరాజ్, కారం సత్తిబాబు, చింతూరు వైస్ ఎంపీపీ పండా నాగరాజు ఆసిఫ్, చిట్టిబాబు, బేతి ముత్తయ్య, చిలకం హరనాథ్, నరేంద్రకుమార్, కుంజా అప్పారావు, డి.సాయిరాజ్ పాల్గొన్నారు.