కరీంనగర్లో ఉద్రిక్తత
కరీంనగర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ.. అధికారులు గుడిని కూల్చేయడం కరీంనగర్ పట్టణంలో కలకలం రేపింది. హెలీప్యాడ్ పార్కులోని అంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన నవగ్రహాల గుడిని రెవిన్యూ అధికారులు అర్థరాత్రి కూల్చేశారు. ఈ ఘటనతో స్థానికులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూల్చివేసిన గుడి పునర్ణిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో ఆందోళనకారులు కొంత శాంతించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నగరంలో భారీగా పోలీసులను మోహరించారు.