లంకమలలో పోలీసుల కూంబింగ్‌ | Police koombing in Lankamala Forest | Sakshi
Sakshi News home page

లంకమలలో పోలీసుల కూంబింగ్‌

Published Fri, Sep 9 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

Police koombing in Lankamala Forest

చెన్నూరు : లంకమల అడవుల్లో ప్రత్యేక పోలీసుల కూంబింగ్‌ రెండు రోజులుగా కొనసాగుతోంది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ కూంబింగ్‌ శుక్రవారం కూడా కొనసాగింది. ఎర్రచందనం దుంగల కోసం తమిళ కూలీలు భారీగా లంకమలలో తిష్ట వేశారనే స్పష్టమైన సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు. చెన్నూరు ఎస్‌ఐతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు 20 మందికి పైగా చెన్నూరు మండల సరిహద్దుల్లో నుంచి లంకమలలోకి వెళ్లారు. ఎర్రచందనం చెట్లు నరికిన ప్రదేశానికి వారు చేరినట్లు సమాచారం. కూలీలు పట్టుబడ్డారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చెన్నూరు, ఖాజీపేట అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement