lankamala
-
సిద్ధవటం.. అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో నిష్ణాతులైన యేసుబాబు, మేకా వి.రాఘవేంద్రవర్మ, సిద్ధవటం అటవీ రేంజి ఆఫీసర్ బి.కళావతితో కూడిన బృందం లంకమల అభయారణ్యం పరిధిలోని శాసనాలను అధ్యయనం చేసేందుకు గురువారం పర్యటించింది.బృందం ఇక్కడ పరిశీలన జరిపి లేబుల్ శాసనాల (బండరాయిపై చెక్కబడిన పేర్లు)ను సేకరించింది. అట్లూరు మండల పరిధిలోకి వచ్చే సుమారు 3,200 అడుగుల ఎత్తులోని లంక మలలోని గోపాలస్వామి కొండ, పరిసరాల్లో రెండు బండలపై సిద్ధమాతృక, శంఖులిపి, దేవనాగరి లిపిలలో ఉత్తర భారతీయ యాత్రికుల పేర్లు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక యాత్రికులకు చెందిన శాసనాలుగా నిర్ధారించారు. వీటిపై చెక్కబడిన 12 లేబుల్ శాసనాలను పరిశీలించిన బృందం వాటి కాపీలను తీసుకుంది. కుషానుల కాలం నాటి కళాత్మకతలేబుల్ శాసనాల్లో పేర్లు చెక్కిన తీరు పురావస్తు శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యంత కళాత్మకంగా చెక్కబడిన ఈ పేర్లను పరిశీలించాక 6వ శతాబ్దంలో అప్పటి కుషాను రాజుల కాలం నాటి కళాత్మకత కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. కుషానుల కాలం నాటి బొటనవేలి మొన శైలిలో తలకట్టును ఉపయోగించి పేర్లను చెక్కినట్టు గుర్తించారు. ఇది 5–6 శతాబ్దాల నాటి ఉత్తర భారత సిద్ధమాతృక లిపి అని నిర్ధారించారు.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4–5 శతాబ్దాల వరకు బ్రాహ్మి లిపిని వాడినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కశ్మీర్, పంజాబ్‌లో శారద లిపి, ఒడిశాలో గౌడ, బెంగాల్లో ప్రోటోబెంగాలి లిపిగా ఉండేవి. తర్వాత ఉత్తర భారతంలో 8–9 శతాబ్దాల్లో మనుగడలో ఉన్న సిద్ధ మాతృక లిపి దేవ నాగరిలిపిగా పరిణామం చెందినట్టు భావిస్తున్నారు. లంకమలలో వెలుగుచూసిన లేబుల్ శాసనాల్లో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.నేడు గుహలు, శాసనాల పరిశీలనసిద్ధవటం అటవీ రేంజి పరిధిలోని లంకమల అభయారణ్యంలో వెలుగు చూసిన ప్రాచీన కాలపు శాసనాలపై భారతీయ పురావస్తు శాఖ పరిశోధన, అధ్యయన బృందం శుక్రవారం సిద్ధవటం మండలంలోని నిత్యపూజలకోన కొండపై శాసనాలు, గుహలు, రాతి విగ్రహాలను పరిశీలించనుంది. ఈ బృందం సిద్ధవటం నుంచి పంచలింగాలకోనకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన నిత్యపూజల కోనకు చేరుకుంటుంది. అక్కడ ప్రాచీన మానవులు నడయాడిన జాడలు, వెలుగులోకి వచ్చిన ఆధారాలను పురావస్తుశాఖ అధికారులు కాపీ చేసుకోనున్నారు. అనంతరం చరిత్రను పరిశోధించి అధ్యయనం చేస్తారు.వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలుపురావస్తు శాఖ బృందం పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు పవిత్ర శైవక్షేత్రంగా, దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రాంతంగా బృంద సభ్యులు గుర్తించారు. ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవనాగరి లిపిని బండరాయిపై కళాత్మకంగా చెక్కిన తీరును బట్టి ఇది దక్షిణ భారతదేశంలో వెలుగు చూసిన తొలి లేబుల్ శాసనంగా బృందం తేల్చింది. ఇక్కడి ఆధారాలు ఆశ్చర్యకరమైన, లంకమల ప్రాంత గొప్పతనాన్ని చెబుతున్నాయి.లంకమలలోని గోపాలస్వామి కోన, నిత్యపూజల కోన ప్రాంతాలు ఇప్పటికీ ప్రసిద్ధి చెందినవే. గోపాలస్వామికొండపై ఆలయానికి పశ్చిమాన ఎత్తైన కొండపై రెండు బండరాళ్లు ఉన్నాయి. వాటిలో శ్రీ విశిష్ఠ కంకణధారి, యె ధర్మజ, చంద్రహాస తదితర పేర్లు కలిగిన లేబుల్ శాసనాలు ఉన్నాయి. ఇవి దేవనాగరి లిపికి చెందినవి కాగా.. క్రీ.శ. 4–16 శతాబ్దాల మధ్య ఇక్కడికి వచ్చిన యాత్రికుల పేర్లను బండపై చెక్కినట్టు లభ్యమైన లిపి ఆధారంగా నిర్ధారించారు. ఈ పేర్లు ఉత్తర భారతం నుంచి లంకమల ఆలయాల దర్శనం కోసం వచ్చిన యాత్రికులవై ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 4వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మిలిపి పరిణామ క్రమాన్ని గుర్తించడం విశేషం. తొలి శాసనం ఇదేఉత్తర భారతానికి చెందిన యాత్రికులు లంకమలకు వచ్చినట్టు వెల్లడిస్తున్న తొలి చారిత్రక ఆధారం ఈ శాసనాలే అని పురావస్తు బృందం నిర్ధారించింది. దక్షిణ భారతంలో ఏకైక ఉత్తర భారత యాత్రికుల పేర్లు సిద్ధమాతృకలో రాసి ఉన్న ఇవి ఏకైక శాసన ఆధారమని పేర్కొంటున్నారు. ఈ శాసన అధ్యయనం దక్షిణ భారత చరిత్రలో మొదటిసారి కాబోతోందని వెల్లడించారు. శాసనాల అధ్యయనం నిపుణుడు యేసుబాబు మాట్లాడుతూ వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. -
15 మంది తమిళకూలీల అరెస్ట్
బద్వేలు అర్బన్: లంకమల అభయారణ్యంలోని కంచెర్ల కోన వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ డిఎస్.సుదర్శన్ తెలిపారు. స్థానిక ఫారెస్ట్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లంకమల అభయారణ్యంలోకి తమిళ కూలీలు ప్రవేశించారన్న సమాచారం రావడంతో తనతోపాటు ఇతర సిబ్బంది అటవీప్రాంతంలోకి వెళ్లగా.. కంచెర్ల కోన వద్ద వంట చేస్తూ తారస పడ్డారని తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడుగొడ్డళ్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువన్నామలై, కృష్ణగిరి జిల్లాలలోని పెరుంబల్లి, డేగరకుప్పం, నడుకుప్ప, తిరుపత్తార్, చంగం, వెలుచునూరు గ్రామాలకు చెందిన వారని వివరించారు. ఈ దాడులలో ఎఫ్ఎస్ఓ రమణ, ఎఫ్‌బివోలు జాకీర్ అహ్మద్, రవి, కరుణాకర్, మునెయ్య, సుదర్శన్, బాషా, ఏబీఓలు సురేష్, బ్రహ్మయ్యతోపాటు వివిధ బీట్ల ప్రొటక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
15 మంది తమిళకూలీల అరెస్ట్
బద్వేలు అర్బన్: లంకమల అభయారణ్యంలోని కంచెర్ల కోన వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ డిఎస్.సుదర్శన్ తెలిపారు. స్థానిక ఫారెస్ట్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లంకమల అభయారణ్యంలోకి తమిళ కూలీలు ప్రవేశించారన్న సమాచారం రావడంతో తనతోపాటు ఇతర సిబ్బంది అటవీప్రాంతంలోకి వెళ్లగా.. కంచెర్ల కోన వద్ద వంట చేస్తూ తారస పడ్డారని తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడుగొడ్డళ్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువన్నామలై, కృష్ణగిరి జిల్లాలలోని పెరుంబల్లి, డేగరకుప్పం, నడుకుప్ప, తిరుపత్తార్, చంగం, వెలుచునూరు గ్రామాలకు చెందిన వారని వివరించారు. ఈ దాడులలో ఎఫ్ఎస్ఓ రమణ, ఎఫ్‌బివోలు జాకీర్ అహ్మద్, రవి, కరుణాకర్, మునెయ్య, సుదర్శన్, బాషా, ఏబీఓలు సురేష్, బ్రహ్మయ్యతోపాటు వివిధ బీట్ల ప్రొటక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
కలివికోడీ...కనిపించవే..!
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. అందులోనూ అంతరించిపోతున్న జాతుల్లో ఇదీ ఒకటి. ఈ పిట్ట 30 ఏళ్ల క్రితం ఒక్కసారి తళుక్కుమంది. అప్పటినుంచి ఇప్పటివరకు చూస్తామంటే కనిపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా జాడ కూడా దొరకలేదు. రాత్రిపూట మాత్రమే తిరగాడే ఈ పిట్ట ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు శోధిస్తున్నారు. ఆ పిట్టే కలివికోడి. ఇది 1948లో బ్రిటీషు సైన్యాధిపతి చూశారు. తర్వాత 1986లో వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలంలోని కొండూరు బీటులో ముచ్చెమ్మకుంటలో కనిపించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని కలివికోడి లంకమల అటవీప్రాంతంలో కనిపించిన నేపథ్యంలో ఇక్కడే కలివికోడి జాతికి చెందిన పక్షులుంటాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 30 ఏళ్లుగా నిరీక్షణ.. 1986లో ఒక్కసారి మాత్రమే కనిపించిన కలివికోడి జాడ కోసం అటవీ అధికారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు. ఆరుగురు ప్రత్యేక ప్రొటెక్షన్ సిబ్బందితోపాటు సుమారు 144 కెమెరాలను త్వరలోనే అమర్చేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెలకు కెమెరా బ్యాటరీలకు, సిబ్బంది జీతాలకుగాను దాదాపు రూ.45 వేలు ఖర్చు వస్తోంది. లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న వేలాది హెక్టార్లలో ఈ కెమెరాలను అమర్చనున్నారు. పరిశోధనల్లో కనిపించని ఫలితం ఎనిమిదేళ్ల క్రితం ముంబయికి చెందిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సభ్యులు ఇక్కడ పరిశోధనలు చేశారు. ఉదయాన్నే అడవిలోకి బయలుదేరడం, సాయంత్రానికి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటూ కొంతమంది సభ్యుల బృందం నాలుగేళ్లపాటు కలివికోడి ఆనవాళ్ల కోసం పరిశోధనలు చేశారు. అడవిని గాలించినా...అంతా శోధించినా జాడ కనిపించలేదు. నాలుగేళ్లపాటు లంకమల అభయారణ్యంలో జల్లెడ పట్టిన పరిశోధన బృందం ఉసూరుమంటూ వెనుదిరిగింది. కొండూరులో ఉన్న పరిశోధన కేంద్రం ప్రస్తుతం మూతపడింది. భారీగా ఖర్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేశాయి. అట్లూరు మండలంలోని కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది. అందుకోసం రైతుల భూములకు పరిహారంగా రూ.28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో రూ.22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. సిద్దవటం-బద్వేలు రోడ్డును ఇప్పుడు కూడా అభయారణ్యం పరిధిలో ఇబ్బంది కలుగుతుందని రాత్రిపూట వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా...కలివికోడి మాత్రం కనిపించకపోవడం అధికారులను కలవరపెడుతోంది. కనిపిస్తుందని ఆశ ఉంది: మహమ్మద్ దివాన్ మైదిన్, కడప అటవీశాఖాధికారి లంకమల్లేశ్వర అభయారణ్యంలో నిధుల కొరతతో కెమెరాలు దాదాపు ఎనిమిది నెలలుగా అమర్చలేదు. రీవ్యాలిడేషన్ నిధులు ఉండటంతో ప్రస్తుతం 144 కెమెరాలను అడవిలో పెట్టేందుకు సిద్ధమయ్యాం. త్వరలోనే వాటిని అక్కడక్కడ బిగించి కలివికోడి కోసం శోధిస్తాం. ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తుందన్న ఆశ మాత్రం ఉంది. -
లంకమలలో పోలీసుల కూంబింగ్
చెన్నూరు : లంకమల అడవుల్లో ప్రత్యేక పోలీసుల కూంబింగ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ కూంబింగ్ శుక్రవారం కూడా కొనసాగింది. ఎర్రచందనం దుంగల కోసం తమిళ కూలీలు భారీగా లంకమలలో తిష్ట వేశారనే స్పష్టమైన సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు. చెన్నూరు ఎస్ఐతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు 20 మందికి పైగా చెన్నూరు మండల సరిహద్దుల్లో నుంచి లంకమలలోకి వెళ్లారు. ఎర్రచందనం చెట్లు నరికిన ప్రదేశానికి వారు చేరినట్లు సమాచారం. కూలీలు పట్టుబడ్డారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చెన్నూరు, ఖాజీపేట అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
పోటెత్తిన భక్తజనం
అట్లూరు: లంకమల్లేశ్వర అభయారణ్యంలో వెలసిన శ్రీకొండగోపాలస్వామి ఆలయం శ్రావణ మాస మూడవ శనివారం భక్తులతో పోటెత్తిపోయింది. ప్రతిఏటా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో స్వామి వారికి పూజలు చేయడం, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం ఆనవాయితి. అందులో భాగంగా శనివారం భక్తులతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరాలతో పోటెత్తిపోయింది. ఉదయం ఆరు గంటలకే భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుని స్వామి దర్శనానికి క్యూకట్టారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తిలకించేందుకు రాష్ట్ర అవార్డు గ్రహిత పొత్తపి కొండయ్యచే పండరిభజన కార్యాక్రమం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయకమిటీ అన్నదాన కార్యక్రమంతో పాటు తాగునీరు తదితర వసతులు కల్పించారు.