శ్రీకాకుళం జిల్లాలో భారీగా సోదాలు.. పలువురి అరెస్ట్ | police raids on call money Traders houses in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో భారీగా సోదాలు.. పలువురి అరెస్ట్

Published Wed, Dec 16 2015 3:38 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police raids on call money Traders houses in srikakulam district

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో భారీగా సోదాలు నిర్వహించారు. టెక్కలి, ఇచ్ఛాపురం, పలాసలలో జరిపిన సోదాల్లో భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీకాకుళంలో రామిరెడ్డి, సత్తిరెడ్డి, ఇచ్ఛాపురంలో వెంకట్రావు, పలాసలో నాగిరెడ్డి, టెక్కలిలో రమణ అనే వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సోదాల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలు, బ్లాంక్ చెక్లు, వివిధ డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల అగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారుల వేధింపులపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement