పోలీసు జులుంపై జనాగ్రహం | Police station siege | Sakshi
Sakshi News home page

పోలీసు జులుంపై జనాగ్రహం

Published Tue, Jan 24 2017 12:33 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Police station siege

= స్టేషన్ ను ముట్టడించిన 
ఎస్సీ కాలనీవాసులు 
= ఎస్‌ఐ చొరవతో ఆందోళన విరమణ 
చిలమత్తూరు: పోలీసుల జులుంపై ఆగ్రహించిన ప్రజలు స్టేష¯Œన్ ను ముట్టడించిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రమైన చిలమత్తూరులో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు... స్థానిక ఎస్సీ కాలనీలో ఆదివారం మదగలమ్మ జాతర సందర్భంగా అంగన్వాడీ సెంటర్‌ సమీపంలోని రచ్చకట్ట వద్ద ఐదుగురు చెక్కాబారా ఆడుకుంటుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. కొందరు పరిగెత్తగా దొరికిన ముగ్గురిని వారు చితకబాదారు. ఆదినారాయణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఆ దెబ్బలు చూసి ఆయన భార్యకు, కాలనీవాసులకు పోలీసులపై కోపం కట్టలు తెంచుకుంది. అందరూ కలిసి సోమవారం ఉదయం పోలీసుస్టేçÙ¯ŒS వద్దకొచ్చి బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాకుండా తమవారి దగ్గరున్న డబ్బులు కూడా లాగేసుకున్నారని ఆ ఇద్దరి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జమాల్‌బాషా కరువు బృందం బందోబస్తులో ఉన్నప్పటికీ హుటాహుటిన స్టేష¯ŒS వద్దకొచ్చారు. కాలనీ పెద్ద మనషులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అందుకయ్యే ఖర్చులు తానే పెట్టుకుంటానని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన కానిస్టేబుâýæ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement