రాజకీయ విభేదాలతో నష్టం
రాజకీయ విభేదాలతో నష్టం
Published Fri, Aug 26 2016 6:07 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM
హుస్నాబాద్ : ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మధ్య గల రాజకీయ విభేదాలతో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించకపోతే సహించేదిలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్‌కు రెవెన్యూ డివిజన్ తేలేని పరిస్థితిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ రాజీనామా చేయాలని కోరారు. జోనల్ వ్యవస్థను ముట్టుకోవద్దన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కరీంనగర్‌లోనే కొనసాగించాలన్నారు. తోటపల్లి భూ నిర్వసితులు తమ భూములు దున్నుకోవాలని, ఎవరైనా అడ్డొస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్నయాదవ్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, ఎండీ హస్సేన్, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పచ్చిమట్ల సంపత్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, బీజేపీ నాయకులు వేముల దేవేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజు పాల్గొన్నారు.
Advertisement