ponna prabhakar
-
జిల్లాలో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్లమెంట్ పోరులో పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించింది. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, మాజీలు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లినా.. పదేళ్ల క్రితం నాటి ఓటు బ్యాంకును నమ్ముకొని అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం లభిస్తుం దేమోనన్న అంచనాలతో అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లోని ఫలితాలను లెక్కలోకి తీసుకోకుండా దేశంలో ప్రధాని ఎవరనే అంశం ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం సాగించేలా వ్యూహాలు సిద్ధం చేశారు. టీఆర్ఎస్కు ఓటేయడం వల్ల ఉపయోగం లేదని.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారనే స్లోగన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అదే సమయంలో పలుచబడ్డ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. జీవన్‌రెడ్డి గెలుపుతో ఉత్సాహం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి భారీ ఆధిక్యతతో తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించిన విషయం విదితమే. ఇది ఆ పార్టీ కరీంనగర్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుచుకుంది. అయితే మూడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని కాంగ్రెస్ పా ర్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగానే జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ విజయం సాధ్యమైందని, ఇవే ఫలి తాలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రమే పాల్గొనే ఈ ఎన్నికలకు.. సాధారణ ఎన్నికలకు మధ్య తేడా చాలా ఉంటుందనే విషయం ఆయనకు తెలిసినా, జీవన్‌రెడ్డి గెలుపును ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. జీవన్‌రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి కూడా కావడంతో పొన్నం ప్రభాకర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పార్టీని వీడడం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎంత మేర ప్రభాకర్‌కు సహకరిస్తారనేది కూడా వేచిచూడాలి. చాలా నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు ఇంకా జనజీవన స్రవంతిలోకి రాకపోవడం కొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసే బాధ్యతను జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం భుజాన వేసుకున్నారు. స్థానికతే ‘పెద్ద’ సమస్య పెద్దపల్లి నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనకూల వాతావరణం ఉన్నప్పటికీ, అభ్యర్థి స్థానికత పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ జిల్లాతో సంబంధంలేని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన ఆగం చంద్రశేఖర్‌ను బరిలో దింపా రు. పార్టీలో పలువురు నాయకులకు చంద్రÔశేఖర్ పోటీ చేయడం నచ్చడం లేదు. ధర్మపురి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోగా, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు పెద్దపల్లి టికెట్ రాకపోవడంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. వీరి తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థుల నుంచి తగిన సహకారం అందడం లేదు. అయి తే చంద్రశేఖర్ తనకున్న పరిచయాలతో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ నాయకులను కలుపుకుపోయే పనిలో పడ్డా రు. అదే సమయంలో టీఆర్ఎస్ కూడా మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను కాదని చెన్నూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొర్లకుంట వెంకటేశ్ నేతను నిలబెట్టింది. ఈయన కూడా ప్రజలకు కొత్త వ్యక్తే. ఈ నేపథ్యంలో మారి న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనుకూలం అవుతుం దని పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘన విజయం సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న శ్రీధర్‌బాబు ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రామగుండంలో టీఆర్ఎస్ ఓడిపోయి ఇండిపెండెంట్ గెలిచినా అది వ్యక్తిగత అభిమానంతోనే చెబుతారు. దీంతో ఈసారి రామగుండం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది అంతుపట్టని అంశంగా మారింది. పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లిల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోనే గెలవగా, ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. వివేక్ మద్దతు ఇస్తే అనుకూలం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వెంకటస్వామి(కాకా) నాలుగు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన కుమారుడు వివేక్ 2009లో ఎంపీగా గెలిచారు. ఈనేపథ్యంలో కాకా కుటుంబానికి వీర విధేయ అభిమానులు నియోజకవర్గంలో ఉన్నారు. ఆయనకు టీఆర్ఎస్కు టికెట్ ఇవ్వకపోవడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పటి వరకు వివేక్ పార్టీకి రాజీనామా చేయకపోగా.. ఏ పార్టీలో చేరుతారనే విషయాన్నీ ప్రకటించలేదు. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆయన బీజేపీ టికెట్ ఇస్తే వేరే రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే భారీగా ఓట్లు పోలవుతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జిగా మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌ను గెలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
సైనికుల్లా పనిచేయండి
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఇందిరాగార్డెన్‌లో పట్టణంలోని 50 డివిజన్లకు చెందిన బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎంపీగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో పట్టణంపై దృష్టిసారించలేకపోయానని అప్పుడు పరిధి 31 మండలాలు, ఐదు పట్టణాలు విస్తీర్ణం ఉండడం వల్ల సమయం సరిపోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పట్టణంలోని కార్యకర్తలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హమీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులను ప్రజల్లో వివరించి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించేలా బూత్ లెవల్లో కష్టపడాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, కర్ర రాజశేఖర్, ఆమ ఆనంద్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, బుచ్చిరెడ్డి, రహమత్, ఆకుల ప్రకాష్, ఉమాపతి, ఆరీఫ్, ఉప్పరి రవి, దిండిగాల మధు, తాజ్, చెర్ల పద్మ, కన్న కృష్ణ, అంజనీకుమార్, ప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, దండి రవీందర్ పాల్గొన్నారు. -
ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక..!
సాక్షి, న్యూఢిల్లీ: అభ్యర్థుల ఖరారు విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. అభ్యర్థుల వడపోత ఏకధాటిగా ఏడుగంటలపాటు సాగింది. కాగా, సాయంత్రం సమయంలో వడపోత కార్యక్రమానికి స్క్రీనింగ్ కమిటీ కాసేపు విరామం ఇచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగనుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ ముగించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు అభ్యర్థుల ఖరారును పూర్తిచేయాలని స్ర్కీనింగ్ కమిటీ సభ్యులు పట్టుదలతో ఉన్నారు. 40 మంది అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం వడపోత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 8న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం లోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించుకుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, సంప్రదింపుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 9న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ మిగతా 14 మంది అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు నెలల సమయం ఎందుకు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు దిగజారి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. -
టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ హెచ్చరించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటనను సాకుగా చూపి ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించాలనే నిర్ణయం అనాగరికమన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మూర్ఖత్వమని విమర్శించారు. ప్రతిపక్షాలను చులకన చేయడం, ధర్నాచౌక్‌లు ఎత్తివేయడం నియంత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండా అంటూనే రక్తపుటేరులు పారిస్తున్నారని.. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. చెర్ల పద్మ, దిండిగాల మధు, బాశెట్టి కిషన్, మాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, సాయికృష్ణ, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. నిరంకుశ చర్య: మాజీ ఎంపీ పొన్నం బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యకు నిదర్శనమని టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హెడ్‌ఫోన్ విసిరిన సంఘటనను సాకుగా చూపి ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయడం, 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పెప్పర్‌స్ప్రే దాడి జరిగినా..స్పీకర్ సమావేశాన్ని కొనసాగించిన తీరును గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామని పొన్నం హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం : గజ్జెల కాంతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం అన్నారు. నియంతల వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుయాత్రలో కాంగ్రెస్కువచ్చిన ప్రజాస్పందనను చూసీ కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, నాయకులు బాశెట్టి కిషన్, చొప్పదండి మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి జనార్దన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎం.తిరుపతిరావు, సముద్రాల అజయ్ పాల్గొన్నారు. జమ్మికుంటలో.. బడ్జెట్ సమావేశాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంటలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆబాది రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాస్, రియాజ్ అక్కడికి చేరుకోగానే.. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరిగింది. పర్లపల్లి రమేశ్, దిడ్డి రామ్, సాయిని రవి, ఎండి సలీం, తిరుపతి, భాస్కర్, ఎగ్గని శ్రీనివాస్, బోగం వెంకటేశ్, గౌస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ విభేదాలతో నష్టం
హుస్నాబాద్ : ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మధ్య గల రాజకీయ విభేదాలతో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించకపోతే సహించేదిలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్‌కు రెవెన్యూ డివిజన్ తేలేని పరిస్థితిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ రాజీనామా చేయాలని కోరారు. జోనల్ వ్యవస్థను ముట్టుకోవద్దన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కరీంనగర్‌లోనే కొనసాగించాలన్నారు. తోటపల్లి భూ నిర్వసితులు తమ భూములు దున్నుకోవాలని, ఎవరైనా అడ్డొస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్నయాదవ్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, ఎండీ హస్సేన్, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పచ్చిమట్ల సంపత్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, బీజేపీ నాయకులు వేముల దేవేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజు పాల్గొన్నారు. -
'పోరు జాతర కాదు..వెంకయ్య వ్యతిరేక యాత్ర చేపట్టండి'
కరీంగనర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పోరు జాతరను వదిలేసి.. వెంకయ్య వ్యతిరేక యాత్రను చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అనుసరిస్తున్నవైఖరిని తప్పబట్టిన పొన్నం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినప్పుడు.. కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా..ఆయన గురించి మాట్లాడటం వృథా అని పొన్నం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సిగ్గు ఉంటే సోనియాకు గుడి కట్టడం కాదని కిషన్ రెడ్డి విమర్శించిన నేపథ్యంలో పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై పోరు జాతర చేయడం కాదని..వెంకయ్య వ్యతిరేక యాత్ర చేయాలన్నారు.