కరీంగనర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పోరు జాతరను వదిలేసి.. వెంకయ్య వ్యతిరేక యాత్రను చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అనుసరిస్తున్నవైఖరిని తప్పబట్టిన పొన్నం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినప్పుడు.. కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా..ఆయన గురించి మాట్లాడటం వృథా అని పొన్నం తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సిగ్గు ఉంటే సోనియాకు గుడి కట్టడం కాదని కిషన్ రెడ్డి విమర్శించిన నేపథ్యంలో పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై పోరు జాతర చేయడం కాదని..వెంకయ్య వ్యతిరేక యాత్ర చేయాలన్నారు.