ప్రైవేట్‌ ఉద్యోగుల సంక్షేమానికి కృషి | Private employees are working for the welfare | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

Published Sat, Feb 25 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ప్రైవేట్‌ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

ప్రైవేట్‌ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

నల్లగొండ రూరల్‌: ప్రైవేట్‌ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగ సంఘం క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ రంగ ఉద్యోగుల సమస్యల పరిష్కా రం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటులో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే కోరిక త్వరలోనే నెరవేరబోతుందన్నారు.

 కేం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నైపుణ్యం గల ఉద్యోగాలకు రూ. 18 వేలు, నైపుణ్యం లేని వారుకు రూ. 15 వేల వేతనం ఇవ్వాలనానరు. ప్రైవేట్‌ ఉద్యోగులందరినీ ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంధం రాములు మాట్లాడుతూ ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

 ప్రమాదంలో మరణించిన ప్రైవేట్‌ ఉ ద్యోగులకు రూ. 15 లక్షల ఆర్థికసాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు స్థానిక బైపాస్‌ నుంచి ర్యాలీగా క్లాక్‌టవర్‌ సెంటర్‌కు చేరుకొని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి క రుణాకర్‌రెడ్డి, గీతాంజలి, తులసి, జిల్లా ఇన్‌చార్జి పందాల యాదగిరిగౌడ్, యాదయ్య, తిరుమల్, బాబు, పాష, సైదు లు, నగేశ్, నాగయ్య, వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement