Private Employee
-
యువతిపై ఆటోలో లైంగిక దాడి..
-
ట్యాక్స్ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటెడ్ మీద పన్ను భారం తగ్గుతుంది. ►జీతం మీద నిర్ణయించిన కమీషన్ శాతం .. ఫిక్సిడ్‌గా ఉండాలి. కమీషన్ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. ►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్మెంటులాగా. ►పెర్క్స్ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. ►పెర్క్స్ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్మెంట్లు.. మొదలైనవి. వీటి మీద పన్ను భారం ఉండదు. ►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. ►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు. ►80సీ సేవింగ్స్ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. ►హెచ్ఆర్ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్ చేయండి. వారు అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. ►ఎరియర్స్ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్‌ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. ►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు. -
ప్రైవేట్ ఉద్యోగులకు పండగే, ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు!
భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏసియా దేశాల్లో భారత్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు 15 శాతం నుంచి 30 శాతం పెరగనున్నట్లు కార్న్ ఫెర్రీ నివేదిక తెలిపింది. సౌత్ ఏసియన్ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సగటు వేతనం ఈ ఏడాది 9.8 శాతం పెరగనుండగా.. అదే యావరేజ్ శాలరీ గతేడాది 9.4శాతం ఉందని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా లైఫ్ సైన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు చెందిన ఉద్యోగుల యావరేజ్ శాలరీ 10శాతం కంటే ఎక్కువ పెరగనున్నట్లు హైలెట్ చేసింది. 818 కంపెనీలు..8లక్షల ఉద్యోగుల జీతాలను కార్న్ ఫెర్రీ దేశ వ్యాప్తంగా 818 కంపెనీల్లో పనిచేస్తున్న 8లక్షల మంది ఉద్యోగులు, 61శాతం సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాలను పరిగణలోకి తీసుకొని ఏ దేశంలో, ఏ రంగంలో ఎంతెంత శాలరీలు పెరుగుతున్నాయనేది స్పష్టం చేసింది. శాలరీ పెంచే అంశంలో భారత్ ముందంజ ఆ లెక్కన భారత్‌లో ఉద్యోగుల యావరేజ్ శాలరీ 9.8శాతం పెరగనుండగా..ఆస్ట్రేలియాలో 3.5శాతం, చైనాలో 5.5శాతం, హాంగ్‌కాంగ్ 3.6శాతం, ఇండోనేషియాలో 7శాతం, కొరియాలో 4.5 శాతం, మలేషియాలో 5శాతం, న్యూజిల్యాండ్‌లో 3.8శాతం, ఫిలిప్పీన్స్‌లో 5.5శాతం, సింగపూర్‌లో 4శాతం, థాయిల్యాండ్‌లో 5శాతం, వియాత్నంలో 8శాతంగా పెరగనున్నాయి. 60శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు టైర్ 1 నగరాలుగా పిలువబడే ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రాల్లోని ఉద్యోగులు అధిక వేతనం పొందుతున్నట్లు కార్న్ ఫెర్రీ తెలిపింది. హైబ్రిడ్, రిమోట్ వర్కింగ్ వంటి కొత్త వర్క్ కల్చర్ పుట్టుకొని రావడంతో.. 60 శాతం కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటి వద్ద నుంచే పనిచేయిస్తున్నాయి. చదవండి👉 'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!' -
ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్
అనంతపురం క్రైం: అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అన్వర్ బాషా రెచ్చిపోయాడు. అకారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న సుదర్శన్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నారాయణ కళాశాలలో చదువుతున్న తన కుమారుణ్ని తీసుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సైఫుల్లా బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బేకరీ వద్ద బండి ఆపి మిక్చర్ తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడ త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు బృందం వాహనాల తనిఖీ చేస్తోంది. ఓ యువకుడి బైక్‌పై నాలుగు ఫైన్లు (చలానాలు) పెండింగ్ ఉండడంతో వాటిని చెల్లించాలని ఎస్ఐ సూచించాడు. అదే సమయంలో సుదర్శన్‌రెడ్డి ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్ అన్వర్‌బాషా చెలరేగిపోయాడు. ‘ఏరా.. వీడియో తీస్తున్నావా’ అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పలానా సంస్థలో ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపలపై ఇష్టానుసారంగా కొట్టాడు. కానిస్టేబుల్ అన్వర్‌బాషా తీరును అక్కడున్న వారు సైతం తప్పుబట్టారు. కొందరు పోలీసుల తీరు వివాదాస్పదం నగరంలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలను, మరీ ముఖ్యంగా వాహనదారులను అకారణంగా దూషించడం, కొట్టడం పరిపాటిగా మారింది. విద్యావంతులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన హుందాగా ఉండాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా..వీరిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. (చదవండి: చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..) -
సెలవుల సమయంలో ఇంటికి వచ్చి వెళ్తుంటాడు.. ఏం జరిగిందో సడన్‌గా..
హొసపేటె(బెంగళూరు): తాలూకాలోని ధర్మసాగర గ్రామానికి చెందిన రంగారెడ్డి(46) అనే ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన బెంగళూరులోని వోల్వో కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ధర్మసాగరలోనే ఉంటున్నారు. రంగారెడ్డి సెలవుల సమయంలో వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలో బుధవారం హొసపేటెలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న యాత్రి నివాస్‌లో గది అద్దెకు తీసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాత్రి నివాస్ సిబ్బంది గమనించి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు తానే కారణమని రంగారెడ్డి రాసినట్లుగా డెత్‌నోట్ లభించిందని టౌన్ పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది. ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. చదవండి: నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి.. -
విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా..
సాక్షి, విశాఖపట్నం: ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ(25), దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తర్వాత ఉపేంద్ర ఇంటికి వచ్చి సుగుణ తలుపులు తీయ్ అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పుసర్ల సూర్యారావు వచ్చి ఏమైందని అడిగాడు. తలుపులు తీయడం లేదని ఉపేంద్ర బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదవండి: (మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
అప్పు తీసుకోలేదు.. కానీ కట్టాలని మెసేజ్..చివరికి
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. ఆయన ప్రమేయం లేకుండానే ఓ బ్యాంక్ నుంచి రూ.4.9 లక్షలు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం బాధితుడి ఖాతాలో పడిన వెంటనే దాంతో పాటు ఆ అకౌంట్లో ఉన్న మరో రూ.25 వేలు కాజేశారు. దీనిపై బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రాజేష్‌కు ఓ రోజు హఠాత్తుగా ఆయన ఖాతాలో రూ.4.9 లక్షలు క్రెడిట్ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనిపై ఆరా తీయగా ఓ బ్యాంకులో ఈయన పేరుతో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్లు, మంజూరైన మొత్తం ఖాతాలో పడినట్లు తెలిసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ మొత్తంతో పాటు అందులో ఉండాల్సిన రూ.25 వేలు కూడా మరో ఖాతాకు బదిలీ అయిపోయాయి. దీనిపై రాజేష్‌కు స్పష్టత రాకుండానే బ్యాంకు నుంచి వాయిదాల చెల్లింపు కోరుతూ ఫోన్లు మొదలయ్యాయి. తాను అసలు రుణమే తీసుకోలేదని, ఆ మొత్తంతో పాటు తన ఖాతాలోనివీ మాయమయ్యాయంటూ చెప్పినా బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. మీ పేరు, వివరాలతో దరఖాస్తు చేస్తేనే రుణం మంజూరు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ, పెనాల్టీలు కట్టాలని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి బాధితుడి ఫోన్‌కు మాల్వేర్ పంపడం ద్వారా సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకు నుంచి పూర్తి వివరాలు కోరతామని, ఆ తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. ( చదవండి: జల్సాలకు అలవాటు పడి కన్నకొడుకునే! ) -
‘చాటింగ్’కు రూ.లక్షలు ఖర్చు...
సాక్షి, సిటీబ్యూరో: ఖాతాదారులకు చెందిన షేర్లు కాజేయడంతో పాటు నకిలీ ధ్రువీకరణలతో వాటిని విక్రయించి రూ.5.4 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాచిగూడకు చెందిన శ్రీనివాసచారి వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను కొన్నేళ్ల క్రితం బేగంపేటలోని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన షేర్ల వ్యాపార సంస్థలో అనేక షేర్లు ఖరీదు చేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన వీటిని అమ్ముకోలేదు. ఈ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రవణ్‌కుమార్, అతని సహాయకుడు లక్ష్మీ దీపక్ తమ సంస్థలో షేర్లు ఖరీదు చేసి, కొన్నేళ్ల పాటు వాటిని తిరిగి విక్రయించని వ్యక్తుల వివరాలు సేకరించారు. వాటిలో శ్రీనివాసచారి ఖరీదు చేసిన షేర్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వృద్ధాప్యంలో ఉండటంతో అతని మనుమడైన డాక్టర్ విజయ్ను సంప్రదించారు. మీ తాతగారు సుదీర్ఘకాలం క్రితం తమ సంస్థ ద్వారా భారీ స్థాయిలో షేర్లు ఖరీదు చేసినట్లు చెప్పడంతో విజయ్ ఆ షేర్లు విక్రయించి నగదు ఇవ్వాల్సిందిగా కోరారు. కొంత మేరకు షేర్లు విక్రయించగా వచ్చిన నగదును శ్రవణ్, దీపక్‌లు విజయ్‌కు అప్పగించారు. ఆపై కుట్ర పన్నిన వీరు మిగిలిన షేర్లకు సంబంధించిన మొత్తం కాజేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా విజయ్, శ్రీనివాసచారి పేర్లతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసిన ఇరువురూ వీటి ఆధారంగా వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచారు. రూ.2.94 కోట్ల విలువైన షేర్లను అనధికారికంగా విక్రయించి ఆ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసుకున్నారు. వీటి నుంచి నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని కాజేశారు. అలాగే ఉషారాణి అనే మహిళకు చెందిన ధ్రువీకరణలు సంగ్రహించిన దీపక్ వీటి ఆధారంగా ఆమె షేర్లు విక్రయించాడు. మొత్తం రూ.2.5 కోట్లు శ్రవణ్ సహకారంతో తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. సహకరించినందుకు కమీషన్‌గా శ్రవణ్‌కు రూ.5 లక్షలు చెల్లించాడు. ఇలా వీరు రూ.5.4 కోట్లు కాజేశారు. 2014లో జరిగిన ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు గతేడాది, ఈ ఏడాది ఫిర్యాదులు అందాయి. వీటిని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శ్రీనివాసాచారి కేసులో నిందితులను గత డిసెంబర్లో అరెస్టు చేసింది. ఇటీవల నమోదైన ఉషారాణి కేసుకు సంబంధించి మంగళవారం దీపక్‌ను పట్టుకుంది. పరారీలో ఉన్న శ్రవణ్ కోసం గాలిస్తోంది. ‘చాటింగ్’కు రూ.లక్షలు ఖర్చు... ఇలా సంపాదించిన సొమ్ముతో దీపక్ జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నెట్లో ని కొన్ని చాటింగ్ సైట్స్‌లో వీడియో చాటింగ్ చేయడానికి డాలర్ల రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీటికి బానిసగా మారిన దీపక్ ప్రతి రోజూ గంటల తరబడి అదే పనిలో ఉండేవాడు. చాటింగ్‌లో పరిచయమైన వారితో ‘వ్యక్తిగత సంభాషణలు’ చేయాలన్నా, వారి ‘ఫొటోలను’ పొందాలన్నా మరికొంత చెల్లించాల్సిందే. ఈ రకంగా దీపక్ రూ.లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. చాటింగ్ ద్వారా పరిచయమైన ఓ విదేశీ యువతికి పూర్తి ఖర్చులు భరించిన ఇతగాడు ఢిల్లీకి రప్పించాడు. అక్కడి ఓ సెవెన్ స్టార్ హోటల్లో నెల రోజులకు పైగా ఆమెతో కలిసి బస చేశాడు. విమానాల్లో షికార్లు, స్టార్ హోటల్స్‌లో బస, విలాసవంతమైన జీవితం... వీటికే డబ్బంతా ఖర్చు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. -
అమ్మ, బాపు క్షమించండి...
నేరేడ్మెట్: ‘ఆ ముగ్గురి వేధింపుల కారణంగానే..నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..అమ్మ, బాపు నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలవర్మరణానికి పాల్పడిన సంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జేకే కాలనీలో జరిగింది.ఎస్ఐ నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..జేకే కాలనీలో సింగం కరుణాకర్(28) మిత్రులతో కలిసి ఒక గదిలో ఉంటూ తుర్కపల్లిలోని ఈఎల్బీఈ కంపెనీలో బయోలాజిస్టుగా పని చేస్తున్నాడు.ఆదివారం రాత్రి అతను తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే కంపెనీలో మైక్రో బయోలాజీ సూపర్వైజర్లుగా, మేనేజర్‌గా పని చేస్తున్న సీహెచ్.చంద్రశేఖర్, సీహెచ్.కుమార్ రాజా, ఎం.శ్రీకాంత్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు వారే కారణమని..వారిని కఠినంగా శిక్షించాలని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మ,బాపు నన్ను క్షమించండి..కొడుకుగా మీకు ఏమీ చేయలేకపోయాను.. అన్న,వదిన, అమ్మ,బాపులను జాగ్రత్తగా చూసుకోండని అందులో రాశాడు. మృతుని సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
తమిళనాడు, పెరంబూరు: వివాహేతర సంబంధం ఒక ఉద్యోగి ప్రాణం బలిగొంది. దీనికి సంబంధించి దంత వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మామల్లపురంలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక గిండికి చెందిన సెంథిల్‌రాజ్ (42) దంత వైద్యుడు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో గతంలో దంత వైద్యుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం గిండిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వివాహితుడైన ఈయన భార్యతో విడాకులు పొందారు. కాగా ఈయన స్నేహితుడు సంజీవ్‌రాజ్ (33). ఉడుమలై పేటకు చెందిన ఇతను గిండీలో నివసిస్తూ ఆ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇతను కూడా తన భార్యకు విడాకులిచ్చి విడిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సెంథిల్‌రాజ్ మొదటి భార్యతో సంజీవ్‌రాజ్ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం సెంథిల్రాజ్కు తెలిసింది. ఈ స్థితిలో పది మందికి పైగా స్నేహితులు క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం రాత్రి మామల్లపురంలోని గెస్ట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో సెంధిల్రాజ్, ఆయన భార్య, సంజీవ్‌రాజ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవిస్తుండగా సెంథిల్‌రాజ్ ఆగ్రహంతో సంజీవ్రాజ్ను వివాహతేర సంబంధంపై ప్రశ్నిస్తూ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని సెంథిల్రాజ్ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సంజీవ్‌రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. -
ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
నల్లగొండ రూరల్: ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పీఆర్టీయూ భవన్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగ ఉద్యోగుల సమస్యల పరిష్కా రం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటులో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే కోరిక త్వరలోనే నెరవేరబోతుందన్నారు. కేం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నైపుణ్యం గల ఉద్యోగాలకు రూ. 18 వేలు, నైపుణ్యం లేని వారుకు రూ. 15 వేల వేతనం ఇవ్వాలనానరు. ప్రైవేట్ ఉద్యోగులందరినీ ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంధం రాములు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణించిన ప్రైవేట్ ఉ ద్యోగులకు రూ. 15 లక్షల ఆర్థికసాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు స్థానిక బైపాస్ నుంచి ర్యాలీగా క్లాక్‌టవర్ సెంటర్‌కు చేరుకొని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి క రుణాకర్రెడ్డి, గీతాంజలి, తులసి, జిల్లా ఇన్చార్జి పందాల యాదగిరిగౌడ్, యాదయ్య, తిరుమల్, బాబు, పాష, సైదు లు, నగేశ్, నాగయ్య, వెంకన్న పాల్గొన్నారు. -
అప్పు డబ్బుల కోసం వెళ్తే అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. స్థానిక భాగ్యలక్ష్మికాలనీకి చెందిన సుకుమార్ దాస్ కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే కాలనీకి చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన రాకేశ్‌కుమార్(26) అతడికి రూ.6,000 బకాయి పడ్డాడు. ఈ మొత్తం ఇవ్వాలని సుకుమార్‌దాస్ శుక్రవారం సాయంత్రం అతడిని అడిగాడు. తన ఇంటికి వస్తే డబ్బు అందజేస్తానని రాకేశ్ బదులిచ్చాడు. దీంతో సుకుమార్ దాస్ తన కుమార్తె(10)ను అతడి ఇంటికి పంపాడు. రాకేశ్‌కుమార్ ఆమెను ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. ఈ మేరకు వారు శనివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్(చాదర్‌ఘాట్): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కమల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కాలనీకి చెందిన కె. అమూల్కుమార్ (28) ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగి. చాలీచాలనీ జీతంతో కుటుంబాన్ని పోషించడం అతడికి కష్టంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన కుమార్ వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు ప్రారంభించారు. -
అమ్మా..నన్ను క్షమించు..!
అమీర్‌పేట: ‘‘చెల్లెలి పెళ్లికి సాయం చేయలేకపోయా. అమ్మా..నన్ను క్షమించు’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ ఎస్సై అజయ్‌కుమార్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డి(23) బల్కంపేట బీకేగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం తన చెల్లికి వివాహం చేసి నగరానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో రాజశేఖర్‌రెడ్డి చనిపోయి ఉండగా గుర్తించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. మృతుడి జేబులో సూసైడ్‌నోట్ దొరికింది. అందులో ‘తన చావుకు ఎవ్వరూ కారణం కాదని, చెల్లి పెళ్లికి డబ్బు ఇవ్వలేకపోయా, అమ్మా నన్ను క్షమించు’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని అదృశ్యం
హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన పి.ఆంజనేయులు కుమార్తె పి.మృదుల హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రెండేళ్ళుగా యూసుఫ్‌గూడలోని హాస్టల్లో ఉంటున్నారు. ఈ నెల 6న తన సోదరుడికి తాను వెళ్ళిపోతున్నట్లు సందేశం పంపిన మృదుల హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. నగరంలోని సంజీవ్‌రెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ఆంధ్రప్రదేశ్‌లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సోదరుడితో పాటు తండ్రి ఆంజనేయులు సైతం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అదృశ్యం వెనుక మృదుల పని చేస్తున్న సంస్థ నిర్వాహకుడైన వివాహితుడు మణికందన్ పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృదుల ఆచూకీ తెలిసిన వారు 9959553307, 9490616619, 040-27852386 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై ఎన్.నగేష్ కోరారు. -
బరితెగించారు..
- రేణిగుంట చెక్‌పోస్టు వద్ద దారుణం - పట్టుకోబోయిన సిబ్బందిపై దూసుకెళ్లిన లారీ - ప్రయివేటు జవాన్ దుర్మరణం రేణిగుంట: బడాస్మగ్లర్లు, అక్రమరవాణాదారులు బరితెగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నా రన్న నెపంతో చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బందిని హతమార్చేందుకు సిద్ధ పడుతున్నారు. జిల్లాలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సోమవారం రేణిగుంట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో సాంబశివ (47) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆగకుండా వేగంగా వెళ్లిన లారీని పట్టుకోడానికి యత్నించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఎర్రచందనం లోడుతో కర్ణాటకకు వెళ్తున్న లారీనే సాంబశివను ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో జిల్లాలోని చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రాణభయం మొదలయింది. పట్టపగలే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటే రాత్రుల్లో ఇంకెంతటి కిరాతకానికి పాల్పడతారోనన్న ఆందోళన నెలకొంది. చెక్‌పోస్టుల్లో వాహనాలు ఆగకుండా వెళితే వాటిని పట్టుకోడానికి ప్రత్యేక వాహనం ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన. ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మృతదేహంతో ధర్నా అక్రమ రవాణా లారీ ఛేజింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్టు ప్రయివేటు జవాన్ సాంబశివ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. రేణిగుంటలోని రామకృష్ణాపురానికి చెందిన సాంబశివ, హోంగార్డు సోమవారం అధిక లోడ్‌తో వెళుతున్న లారీని ఛేజింగ్ చేయగా, నాయుడుపేట-పూతలపట్టు రహదారిలో తూకివాకం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆ లారీ ఢీకొని వెళ్లడంతో అతడు మృతిచెందాడు. అనంతరం ఎస్‌ఎన్‌పురం, రామకృష్ణాపురం వాసులు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి చెక్‌పోస్టు వద్ద అతని మృతదేహంతో ధర్నా నిర్వహించారు. సాంబశివ కుటుంబసభ్యులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ైబె ఠాయించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులో ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్న ఎంవీఐ శివప్రసాద్, రేణిగుంట అర్బన్, రూరల్ సీఐలు బాలయ్య, సాయినాథ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. జీవనాధారం కోల్పోయిన కుటుంబం సాంబశివ మృతితో అతని కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. మృతి చెందిన సాంబశివకు భార్య విమల, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె యోజన ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె జ్యోత్స్న తొమ్మిదో తరగతి, కుమారుడు ఉదయ్‌కుమార్ ఆరో తరగతి చదువుతున్నారు. చెక్‌పోస్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డలను చదివిస్తూ వచ్చాడు. అతని మృతితో కుటుంబసభ్యులు బోరున రోదిస్తున్నారు. -
బైక్ కొనివ్వలేదని చోరీలు
ప్రధాన నిందితుడి అరెస్టు చోరీ సొత్తుకొన్న మరో ఇద్దరూ కటకటాల్లోకి... మొత్తం 21 వాహనాల స్వాధీనం నాచారం, న్యూస్‌లైన్: తండ్రి బైక్ కొనివ్వలేదని అలిగి ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు వాహనాల దొంగగా మారాడు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు, నాచారం పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇతని వద్ద నుంచి చోరీ బైక్‌లను కొన్న మరో ఇద్దరినీ కటకటాల్లోకి నెట్టారు. సోమవారం నాచారం ఠాణాలో మల్కాజిగిరి ఏసీపీ సీహెచ్ చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్లాపూర్ భవానినగర్‌కు చెందిన చుక్క ప్రవీన్‌బాబు(23) ప్రైవేట్ ఉద్యోగి. రెండేళ్ల క్రితం తన తండ్రిని బైక్ కొ నివ్వమని కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రవీన్ బైక్ చోరీలు మొదలెట్టాడు. 2011లో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఇల్లెందులో నాలుగు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. వీటిని ఇల్లెందుకే చెందిన గంగాధరణి శంకర్(27), మహబూబ్‌నగర్ జిల్లా రాచపల్లి గ్రా మానికి చెందిన భారత బాలరాజు(35)కు అమ్మాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఆ తర్వాత నగరంలోని నాచారం, ఉప్పల్, మేడిపల్లి, చైతన్యపురి పోలీస్స్టేషన్ల పరిధిలో పలు బైకులను దొంగి లించాడు. బాలానగర్ సీసీఎస్ ఠాణా ఎస్సై సైదులు అందిచిన సమాచారం మేరకు బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వి.యాదగిరిరెడ్డి బృందం ఆదివారం నాచారం చౌరస్తాలో ప్రవీన్‌బాబును అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు గత రెండేళ్లలో తాను దొంగిలించిన బైక్‌ల వివరాలు చెప్పాడు. వీటిని శంకర్, బాలరాజులకు అమ్మినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఈ ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షల విలువైన 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన నాచారం ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్, బాలానగర్ సీసీఎస్ పోలీసులను ఏసీపి చెన్నయ్య అభినందించారు.