అమ్మా..నన్ను క్షమించు..! | brother committed suicide for bothering on sister marriage | Sakshi
Sakshi News home page

అమ్మా..నన్ను క్షమించు..!

Published Sun, Jun 28 2015 3:21 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

అమ్మా..నన్ను క్షమించు..! - Sakshi

అమ్మా..నన్ను క్షమించు..!

అమీర్‌పేట: ‘‘చెల్లెలి పెళ్లికి సాయం చేయలేకపోయా. అమ్మా..నన్ను క్షమించు’’   అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ ఎస్సై అజయ్‌కుమార్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డి(23) బల్కంపేట బీకేగూడలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం తన చెల్లికి వివాహం చేసి నగరానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో రాజశేఖర్‌రెడ్డి చనిపోయి ఉండగా గుర్తించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.

మృతుడి జేబులో సూసైడ్‌నోట్ దొరికింది. అందులో ‘తన చావుకు ఎవ్వరూ కారణం కాదని, చెల్లి పెళ్లికి డబ్బు ఇవ్వలేకపోయా, అమ్మా నన్ను క్షమించు’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement