అమ్మ, బాపు క్షమించండి... | private employee commit to suicide | Sakshi
Sakshi News home page

అమ్మ, బాపు క్షమించండి...

Published Tue, Feb 13 2018 10:28 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

private employee commit to suicide - Sakshi

కరుణాకర్‌(ఫైల్‌) , సూసైడ్‌ నోట్‌

నేరేడ్‌మెట్‌: ‘ఆ ముగ్గురి వేధింపుల కారణంగానే..నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..అమ్మ, బాపు నన్ను క్షమించండి’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ ప్రైవేట్‌ ఉద్యోగి బలవర్మరణానికి పాల్పడిన సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని జేకే కాలనీలో జరిగింది.ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..జేకే కాలనీలో సింగం కరుణాకర్‌(28) మిత్రులతో కలిసి ఒక గదిలో ఉంటూ తుర్కపల్లిలోని ఈఎల్‌బీఈ కంపెనీలో బయోలాజిస్టుగా పని చేస్తున్నాడు.ఆదివారం రాత్రి అతను తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదే కంపెనీలో మైక్రో బయోలాజీ సూపర్‌వైజర్లుగా, మేనేజర్‌గా పని చేస్తున్న సీహెచ్‌.చంద్రశేఖర్, సీహెచ్‌.కుమార్‌ రాజా, ఎం.శ్రీకాంత్‌ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు వారే కారణమని..వారిని కఠినంగా శిక్షించాలని రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మ,బాపు నన్ను క్షమించండి..కొడుకుగా మీకు ఏమీ చేయలేకపోయాను.. అన్న,వదిన, అమ్మ,బాపులను జాగ్రత్తగా చూసుకోండని అందులో రాశాడు. మృతుని సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement