ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రతి ఎకరాకు నీరు
ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రతి ఎకరాకు నీరు
Published Tue, Sep 6 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
బాల్కొండ:
ప్రాజెక్టుల రీ డిజైన్‌తో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందుతుందని స్పీకర్ మధుసుదనా చారి తెలిపారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తూ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సారెస్పీని ఆధునిక దేవాలయంగా తొలి ప్రధాని జవహర్‌లా నెహ్రూ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ఆధునిక దేవాలయం ద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్‌లోకి వచ్చిన ఇన్‌ఫ్లో, కాలువల ద్వారా నీటి విడుదల వివరాలను ప్రాజెక్టు ఎస్‌ఈ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యాంపై ఫ్లడ్ కంట్రోల్ రూంలో ఎస్సారెస్పీ నిర్మాణానికి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపిన చేసినప్పటి ఫొటోను గోడపై నుంచి తీసి పరిశీలించి చూశారు. స్పీకర్ మధుసుదనా చారిని అధికారులు సన్మానించారు. ప్రాజెక్ట్ సమస్యలపై స్పీకర్‌కు విన్నవించారు. ప్రాజెక్ట్ ఈఈ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement