సూడో నక్సల్స్ అరెస్టు
Published Sat, Oct 8 2016 1:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: నక్సల్స్‌పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన బొల్ల నర్సింహ, పల్లెల్ల సురేందర్, రాచకొండ శ్రీరాములు, అక్కారం కృష్ణ, సమ్మయ్య అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, ఒక పిస్టల్, కార్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తొమ్మిది కేసులున్నాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
Advertisement
Advertisement