
శెభాష్ పుష్పలత!
వైవీయూ :
కాపు, బీసీ విద్యోన్నతి పథకంలో భాగంగా సివిల్స్ ఉచితశిక్షణకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో కడప నగరానికి చెందిన ప్రభాకుల గంగాపుష్పలత చక్కటి ప్రతిభ కనబరిచి ఉచిత శిక్షణకు ఎంపికయ్యారు. కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జూన్ 26న కేఎస్‌ఆర్‌ఎంలో సివిల్స్‌లో ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈనెల 14న కాకినాడలో రెండవ విడత
కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎంపికలకు 61 మంది మహిళా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా ఇందులో 22 మందికి అవకాశం దక్కింది. ఇందులో ఆప్షన్స్ ద్వారా నచ్చిన కోచింగ్ సెంటర్‌ను ఎన్నుకునే అవకాశం కల్పించగా ఈమె ఢిల్లీలోని సివిల్స్‌కోచింగ్ సెంటర్‌ను ఎన్నుకుంది. ఈ పథకం ద్వారా సదరు విద్యార్థినికి నెలకు రూ.10వేలు సై ్టపండ్‌తో పాటు శిక్షణకు అయ్యే
ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.