మండలాల్లో ఓ మోస్తారు వర్షం
–అత్యధికంగా పోచంపల్లిలో 69.2 మిల్లీ మీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 46 మండలాలలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పోచంపల్లి మండలంలో 69.2 మిల్లీ మీటర్లు కురిసింది. నార్కెట్‌పల్లిలో 65.8, రామన్నపేటలో 65.7, కనగల్‌లో 63.0, మునుగోడులో 58.4, చండూరులో 55.0, వలిగొండలో 54.2, గుర్రంపోడులో 50.0, అనుములలో 49.0, చిట్యాలలో 45.4, ఆలేరులో 44.6, చౌటుప్పల్‌లో 41.6, యాదగిరిగుట్టలో 39.0, శాలిగౌరారంలో 36.4, తుర్కపల్లిలో 35.8, కేతేపల్లిలో 35.4, పీఏ పల్లిలో 33.0, నల్లగొండలో 31.0, నూతన్‌కల్‌లో 30.4, నకిరేకల్‌లో 29.4, గుండాలలో 26.4 నారాయణపురంలో 25.6, తిరుమలగిరిలో 25.4, రాజాపేటలో 24.6, బీబీనగర్‌లో 24.0, కట్టంగూరులో 23.6, బీరామారంలో 23.4 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. పెద్దవూరలో 22.2, నాంపల్లిలో 21.0, ఆ్మతకూరులో 20.8, మోత్కూరులో 18.2, చింతపల్లిలో 16.2, .జాజిరెడ్డిగూడెంలో 16.2, భువనగిరిలో 12.4, మునగాలలో 10.2, కోదాడలో 8.0, తిప్పర్తిలో 7.4, దేవరకొండలో 7.0, తుంగతూర్తిలో 6.0, హుజూర్‌నగర్‌లో 5.8, సూర్యాపేటలో 4.8, చిలుకూరులో 4.2, మర్రిగూడలో 3.8 ఆత్మకూరుఎస్‌లో 3.6, మేళ్లచెరువులో 1.8, మఠంపల్లిలో 0.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తం 1295.4 మి. మీటర్ల వర్షం కురిసింది. సగటున వర్షంపాతం 22.0 మిల్లీ మీటర్లు నమోదైంది.
మెట్టకు ప్రాణం
Published Thu, Jul 28 2016 12:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement