5 నుంచి రంగనాథుడి బ్రహ్మోత్సవాలు
ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కార్యానిర్వాహణాధికారి చంద్రమౌళి తెలిపారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు. క్రీ.శ. 14వ శతాబ్ధంలో హరిహర బుక్కరాయలు కాలంలో ఎర్రమ తిమ్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర స్పష్టం చేస్తోంది. ఆలయంలోని మూలవిరాట్ రంగనాథుడు ఐదు అడుగుల పొడవుతో శేషతల్పంపై శయనించినట్లుగా ఉంటుంది..
- తాడిపత్రి రూరల్
బ్రహోత్సవాలు ఇలా..
5న అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్ష హోమ పూజలు ఉంటాయి. 6న సింహ వాహనంపై గ్రామోత్సవం, 7న శేష వాహనం, 8న హనుమద్ వాహనం, 9న గరుడ వాహనం, 10న గజవాహనంపై గ్రామోత్సవాలు ఉంటాయి. 11న స్వామివారి కల్యాణం, రథోత్సవం, 12న అశ్వ వాహనంపై గ్రామోత్సవం, 13న కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనంపై గ్రామోత్సవం ఉంటాయి.