పెన్నహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనారసింహుడి బ్రహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆమిద్యాల గ్రామం పెన్నబిళేసుడి ఆలయం నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను తీసుకోరావడానికి ప్రత్యేక పల్లకిను పెన్నహోబిలం నుంచి తీసుకెళ్లారు. ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారాకానాథ్‌చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి తీసుకొచ్చారు.