ముగిసిన పెన్నోహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం మహా మంగళహారతి, కుంకమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ద్వారకనాథాచార్యులు ఆధ్వర్యంలో ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబులేసుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు.