బాలికపై అత్యాచారయత్నం
Published Wed, Jan 18 2017 11:56 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
కృష్ణగిరి(పత్తికొండ): మండల పరిధిలోని తెగదొడ్డి గ్రామానికి చెందిన దళిత బాలికపై బుధవారం ఆదే గ్రామానికి చెందిన బాలుడు తలారి ప్రకాష్ ఆత్యాచారానికి యత్నించాడు. బాలిక ఉదయమే పొలం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు వివరాలు తెలపడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ సోమ్లానాయక్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నామన్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement