రేప్ చేయబోతే... | Dalit girl bobbitises man during rape attempt Meerut, | Sakshi
Sakshi News home page

రేప్ చేయబోతే...

Published Fri, Jun 24 2016 3:24 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

రేప్ చేయబోతే... - Sakshi

రేప్ చేయబోతే...

లక్నో: తనపై అఘాయిత్యానికి తెగబడిన వ్యక్తిపై  ఓ బాలిక  సివంగిలా విరుచుకుపడింది.  కత్తితో బెదిరించి అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తినుంచి ఆ కత్తినే లాక్కుని... అతని ప్రయివేట్ పార్ట్స్ పై దాడి  చేసింది.  ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ సంఘటన  గురువారం సాయంత్రం జరిగింది.

 పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. 17 ఏళ్ల దళిత బాలిక పై రాయిస్ (23)  అత్యాచారానికి  ప్రయత్నించాడు.   ఇంచోలి   ఏరియాలో  ఉన్న అడవిలోకి వెళ్లిన ఆ బాలికపై అదును చూసి దాడి చేశాడు.   కత్తితో బెదిరించి మరీ ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.  శక్తినంతా కూడ దీసుకుని అతని దగ్గర్నుంచి కత్తిని లాక్కుంది.  అంతే....క్షణం ఆలోచించకుండా అతని  మర్మాంగాలను కోసి పారేసింది. అనంతరం అక్కడినుంచి తప్పించుకుంది.  అయితే అతని  అరపులు విన్న గ్రామస్తులు.. సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని గ్రహించి పోలీసులకు   సమాచారం అందించారు.   నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు.  అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి  అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బాలిక, నిందితుడు  వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఈ చర్యలు చేపట్టామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement