- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నూతన డీఐజీ లక్ష్మీకుమారి
రెవెన్యూ లక్ష్యాన్ని అధిగమిస్తాం
Published Sat, Oct 8 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
కాకినాడ లీగల్ :
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చిన రెవెన్యూ లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తామని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ పి.లక్ష్మీకుమారి శనివారం విలేకరులకు తెలిపారు. హైదరాబాద్‌లో ఐజీ కార్యాలయంలో డీఐజీగా విధులు నిర్వహిస్తూ, బదిలీపై ఆమె జిల్లాకు వచ్చారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన డీఐజీ ఎం.సాయిప్రసాద్ కర్నూలు నోడల్ డీఐజీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఐజీ లక్ష్మీకుమారి మాట్లాడుతూ జిల్లాలో స్టాంపుల ముద్రణ యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయని, నూతన యంత్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అలాగే క్రయవిక్రయదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నోటరీ అడ్వకేట్లు రెన్యువల్ చేసుకోకుండా నోటరీ చేయరాదని తెలిపారు. ఆమెను జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్, సబ్ రిజిస్ట్రార్లు ఎం.రాజబాబు, ఆర్‌వీ రామారావు తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Advertisement
Advertisement