ప్రణాళికతో చదివితే విజయం తథ్యం
Published Wed, Sep 14 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
కేయూక్యాంపస్: విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం తథ్యమని హైదరాబాద్ ఫిలాంథ్రపిస్టు కృష్ణారావు సూచించారు. మంగళవారం కేయూలోని కేరీర్ అండ్ గైడెను సెల్, కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం సంయుక్తంగా గ్రూప్–2, ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ తరగుతులు ప్రారంభించారు. ఈసందర్భంగా క్యాంపస్‌లోని పరిపాలనా భవనంలోని సెనెట్ హాలులో జరిగిన సమావేశానికి కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ కేరీర్ గైడెను సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయబాబు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ముందుగానే సిలబస్‌కు అనుగుణంగా చదవాలని సూచించారు. సమావేశంలో కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ వై.శ్యాంసను, కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, నందయ్య, బాధ్యులు ఎస్.బాలాజీ, కేఎల్‌ఎనుం.రావు, వై.బాబు, రాము, రవికుమార్, శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి వన్నాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ శిక్షణ తరగుతులు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాంపస్‌లోని ఫిజిక్స్ సెమినార్ హాలులో నిర్వహిస్తారు.
Advertisement
Advertisement