projec
-
ప్రణాళికతో చదివితే విజయం తథ్యం
కేయూక్యాంపస్: విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం తథ్యమని హైదరాబాద్ ఫిలాంథ్రపిస్టు కృష్ణారావు సూచించారు. మంగళవారం కేయూలోని కేరీర్ అండ్ గైడెను సెల్, కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం సంయుక్తంగా గ్రూప్–2, ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ తరగుతులు ప్రారంభించారు. ఈసందర్భంగా క్యాంపస్‌లోని పరిపాలనా భవనంలోని సెనెట్ హాలులో జరిగిన సమావేశానికి కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ కేరీర్ గైడెను సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయబాబు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ముందుగానే సిలబస్‌కు అనుగుణంగా చదవాలని సూచించారు. సమావేశంలో కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ వై.శ్యాంసను, కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, నందయ్య, బాధ్యులు ఎస్.బాలాజీ, కేఎల్ఎనుం.రావు, వై.బాబు, రాము, రవికుమార్, శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి వన్నాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ శిక్షణ తరగుతులు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాంపస్‌లోని ఫిజిక్స్ సెమినార్ హాలులో నిర్వహిస్తారు. -
శ్రీరాంసాగర్ రెండోదశ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్ : శ్రీరాం సాగర్ రెండో దశ ప్రధాన కాలువ, బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్సారెస్పీ ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కాలువ, బ్రాంచ్ కెనాళ్ల నిర్దేశిత అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని చెప్పారు. రోడ్లు, మిషన్ కాకతీయ, ఇతర పనులు వర్షాల కారణంగా సాగడం లేదని, వాటికి సంబంధించిన యంత్రాలను వినియోగించుకుని కాలువ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భక్తరామదాసు ప్రాజెక్టు రెండోదశ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రైతుల నుంచి తీసుకున్న భూమికి నష్ట పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినందున ఆయా బ్యాంకర్లు రైతు ఖాతాలో డిపాజిట్ అయిన సమాచారం తెలుసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమక్షంలో రిజిస్ట్రేషన్ ప్రకియను పూర్తి చేయాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన భూమిని త్వరగా సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జేసీ దివ్య మాట్లాడుతూ భక్తరామదాసు రెండో దశ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా రైతుల భూముల్లో చెట్లు, వ్యవసాయ బావి, బోరు బావి, పైపులకు సంబంధించిన నష్ట పరిహారం విలువ సేకరించి నివేదికలు ఇవ్వాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. చెట్లు ఉన్న పక్షంలో డీఎఫ్ఓ కు వివరాలను అందజేయాలని, మిగతా వాటికి ఇంజనీర్లు నష్టపరిహారం నివేదికను అందించాలని కోరారు. సమావేశంలో ఎస్సారెస్పీ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ చావా శ్రీనివాసరావు, ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్లు వెంకారెడ్డి, వెంకటరెడ్డి, -
ఉండాలా.. వెళ్లాలా?
అంతర్మథనంలో హెచ్ఎండీఏ ఇంజనీర్లు జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్‌పై సమాలోచనలు సమ్మతి తెలిపేందుకు తుది గడువు 27 సిటీబ్యూరో : ప్రస్తుతం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు...భవిష్యత్‌లో కొత్తవి వస్తాయన్న నమ్మకమూ లేదు..! పీపీపీ ప్రాజెక్టులకు కూడా సర్కార్ నుంచి చుక్కెదురైంది. దీంతో తమ రోల్ ఏంటో తెలియక హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంలో ఆందోళన మొదలైంది. మరోవైపు మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని వివిధ శాఖలన్నింటిని ఒకే గొడుగు కిందకు తెస్తూ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను అమల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే... తమను జీహెచ్ఎంసీ, మున్సిపాల్టీలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర విభాగాలకు బదిలీ చేసే అవకాశం ఉందని వారు హడలిపోతున్నారు. ఇప్పటివరకు రాజధాని నగరంలో ఉద్యోగం చేసి తాము ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం సాధ్యం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు 30కి పైగా ఇంజనీర్లు కావాలంటూ జీహెచ్ఎంసీ తాజాగా హెచ్ఎండీఏకు లేఖ రాసింది. ప్రధానంగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, లేక్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులు, పార్కుల అభివృద్ధి, ప్రభుత్వం తాజాగా అప్పగించిన ఆర్అండ్బి రోడ్ల అభివృద్ధి, నిర్వహణ వంటి పనులు నిర్వహించేందుకు 1 చీఫ్ ఇంజనీర్, 2 ఎస్ఈలు, 7 ఈఈలు, 25 మంది డీఈఈలు, 25 మంది ఏఈలు కావాలంటూ ఆ లేఖలో పేర్కొంది. ఏడాది పాటు డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీలో కొనసాగాలని తెలిపింది. దీంతో హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిలో అంతర్మథనం మొదలైంది. ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన మాతృసంస్థలోనే కొనసాగాలా...? లేక డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీకి వెళ్లాలా..? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఆఫీసులలో ఏ ముగ్గురు ఇంజనీర్లు కలిసినా...ఇదే విషయమై చర్చించుకోవడం కన్పించింది. ‘హెచ్ ఎండీఏలో ‘పనుల్లేవు... ప్రమోషన్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగడం కంటే ఇతర విభాగాలకు వెళ్లడమే మేలు’ అన్న అభిప్రాయం అత్యధికుల్లో వ్యక్తమవుతోంది. మరికొంతమంది డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు ఆచి తూచి అడుగేస్తున్నారు. ఈ నెల 27 వరకు తుది గడువు జీహెచ్ఎంసీకి డిప్యూటైషన్పై వెళ్లేందుకు సమ్మతి తెలపడానికి ఈ నెల 27ను తుది గడువుగా హెచ్ఎండీఏ నిర్దేశించింది. అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారు శుక్రవారం సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించింది. ఆతర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అదనుగా ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బంది అంతా డిప్యూటేషన్‌పై వెళితే నగరంలోని 4 కాంప్లెక్స్‌లు, 12 ఎస్టీపీలు, బీపీపీ పరిధిలోని పార్కులు వంటివాటి నిర్వహణ ఎలా అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులను కలవరపెడుతున్న విషయం. -
‘పురా’ అమలుపై సమీక్ష
= హాజరైన మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన (పురా) ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలంలో రూ.168.52 కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పనుల అమలుపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు కలెక్టర్ కిషన్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింత నెక్కొండ, రోళ్లకల్లు, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూర్, పెద్దతండాల్లో ప్రభుత్వం పుర ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రాజెక్ట్ అమలు చేసేందుకు మొత్తం రూ.168.52 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ.123.34 కోట్లు (73 శాతం కేంద్ర ప్రభుత్వం), రూ.25.80 కోట్లు (15 శాతం రాష్ట్ర ప్రభుత్వం) రూ.19.38 కోట్లు (11 శాతం కన్సోరిటీయం) చెల్లిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను యుగాంతర్, ఎస్వీఈసీ సంస్థలు చేపట్టనున్నాయి. ఈ మేరకు పర్వతగిరి పెద్ద చెరువులోకి ఎస్ఆర్ఎస్పీ నీటిని పంపింగ్ చేసి సాగు, తాగునీరు అందించేందుకు రూ. 41 కోట్లు, మైనర్, మేజర్ ఇరిగేషన్ పనులను చేపట్టేందుకు రూ.36 కోట్ల ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పంపే విషయంపై మంత్రి, ఎంపీ, కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ఇరిగేషన్ విభాగం అధికారులతో సుమారు రెండుగంటలపాటు చర్చించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పక్షాన పుర పనులను డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో భూమి కొనుగోలుకు సుమారు రూ. 3 కోట్లు, నీటి పంపిణీకి రూ.36.60 కోట్లు, వాటర్షెడ్ల నిర్మాణం కోసం రూ.14.94 కోట్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 6.82 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీలకు రూ. 1.85 కోట్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు రూ. 1.59 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కు రూ. 4.80 కోట్లు, రూరల్ బిజినెస్ హబ్‌కు రూ. 53 లక్షలు, ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంకు రూ.52 లక్షలు, కమ్యూనిటీ రేడియో ఏర్పాటుకురూ. 63లక్షలు, వాటర్ సస్టెనబులిటీకి రూ.41.53 కోట్లు, బ్రాడ్‌బాండ్‌కు రూ.63లక్షలు, ప్యాక్‌హౌస్‌కు రూ.1.19కోట్లు, రీఫర్ వ్యాన్‌కు రూ.60 లక్షలు, కామన్ సర్వీస్ సెంటర్‌కు రూ.47లక్షలు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌కు రూ.33 లక్షలు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. కాగా, ఆర్థిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.6.11 కోట్లతో జిన్నింగ్ మిల్లు ఏర్పాటు, రూ.3.20 కోట్లతో రూరల్ గోదాం నిర్మాణం, రూ.11 లక్షల తో ఇంటర్నెట్ కియోస్క్, రూ.3.16 కోట్లతో లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గత జూలై 22వ తేదీన పురా ప్రాజెక్ట్ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సి ఉండగా... చివరి నిమిషంలో సీఎం రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఈ నెల చివరన ... లేకుంటే నవంబర్ మొదటి వారంలో గాని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, పురా ప్రాజెక్ట్‌ను కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంతోపాటు మరో గ్రామంలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలుకు ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. -
అక్రమాల సంగతేంటి?
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హెచ్ఎండీఏలో, దాని పరిధిలోని జోనల్ కార్యాలయాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నపనికీ అధికారులు స్వప్రయోజనం వెతుకుతుండటంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెడ్డ పేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సోమవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘జోనల్ కార్యాలయాల పై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులేం చేస్తున్నారు? సిబ్బందిపై నియంత్రణ లేదా? ఇలా ఎందుకు జరుగుతోంద’ని ప్రశ్నిం చారు. ‘సాక్షి’లో ‘మహా మాయ’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని తన ఫైల్ నుంచి బయటకు తీసి చూపుతూ అవినీతి అక్రమాలపై అధికారులను నిలదీశారు. ఆ వార్త ఈ రోజే ప్రచురితమైందని పీఆర్ఓ రామకృష్ణ చెప్పగా, దీనిపై ఉదయం నుంచి నీవేం చేశావ్? పై అధికారుల దృష్టికి తీసుకెళ్లావా? అంటూ ఎదురు ప్రశ్నవేశారు. సంస్థపై పత్రికల్లో వార్తలు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని, పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలని హితబోధ చేశారు. కనీసం వివరణ అయినా ఇవ్వండని సూచించారు. స్పందన లేకుండా ఉంటే ఎలా అంటూ పరోక్షంగా కమిషనర్ నీరభ్‌కుమార్‌కు చురక అంటించారు. ‘ఇమేజ్ పెంచుకోండి.. కష్టపడి పనిచేస్తే పేరొస్తుంది. రూల్స్ ప్రకారం పనులు చేయండి. లేదంటే తిరస్కరించండి. అంతేగాని నెలల తరబడి ప్రజలను తిప్పుకోవద్దు’ అంటూ అధికారులను హెచ్చరించారు. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఇక్కడ కొందరు సిబ్బందే కీలకమైన ఫైళ్లను తగులబెట్టడం వల్ల హెచ్ఎండీఏ ప్రతిష్ఠ దిగజారిందని, బాధితులకు న్యాయం చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ ఐకాన్.. ఔటర్ హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రజలు ఔటర్ రింగ్‌రోడ్డు గురించి చెబుతున్నారని, దానిని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను తిలకించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, నిర్దేశించిన లక్ష్యాలను పీడీ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఔటర్ మెయిన్ క్యారేజ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌కి పూర్తి చేస్తామని, అలాగే ఫైనల్ వర్క్‌ను 2014 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఓఆర్ఆర్ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. కమిషనర్ నీరభ్‌కుమార్ సంస్థ ఆర్థిక పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సిన బకాయీల విషయమై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఓ నిర్ణయం తీసుకొంటామని మంత్రి చెప్పారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన అభివృద్ధి నిధులను కూడా ఇప్పించేందుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. తీరు మార్చుకోండి.. విలువైన స్థలాలు కబ్జా అవుతోంటే వాటి నివారణ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ వారిపై తోసేస్తున్నారు. అటు వాళ్లు, ఇటు మీరు పట్టించుకోకపోతే ఆక్రమణలు మరింత పెరుగుతాయి. గ్రామ పంచాయతీల్లో ఇచ్చే పర్మిషన్లు కాదు... హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులే ఫైనల్ కావాలి. ఇందు కోసం ఒక విధానం కావాలి. కొంతమేరకు ప్లాన్లకు అనుమతినిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంటే అది కూడా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే చేసి ఫీజులో వారి వాటా వారికివ్వాలి. డెవలప్మెంట్ అథార్టీ అంటే నగరాభివృద్ధికి పాటుపడాల్సిన సంస్థ. జోనల్ కార్యాలయాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా కొత్త విధానాన్ని అభివృద్ధి చేయండి. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, బిల్డింగ్ ప్లాన్స్, లేఅవుట్స్ వంటివి ఆన్లైన్లో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై దృష్టిపెట్టి సత్ఫలితాలు సాధించండి. - మంత్రి మహీధర్‌రెడ్డి -
ఎండుతున్న ఆశలు
సాక్షి, నల్లగొండ: ఉపాధి హామీ పథకం కింద నాటిన పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు సకాలంలో డ్రిప్ ఏర్పాటు చేయకపోవడంతో వాటికోసం వెచ్చించిన లక్షల రూపాయలు వృథా అవుతున్నాయి. ఫలితంగా లక్ష్యం నెరవేరడం లేదు. కొంతమందికి చెందిన భూముల్లో మాత్రమే డ్రిప్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రైతులు మొక్కలను బతికించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. పథకం తీరు.. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సదుద్దేశంతో వారి పొలాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన 37 మండలాల్లో 1,917 రైతులకు చెందిన 4,400 ఎకరాలను గుర్తించారు. ఇందులో దాదాపు 3.50 లక్షల మామిడి, బత్తాయి, నిమ్మ మొక్కలను గతేడాది నాటారు. వీటికి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ అందజేస్తోంది. 50:20 శాతం లెక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మిగిలిన 30 శాతం నిధుల్ని ఉపాధి హామీ పథకం విడుదల చేస్తుంది. డ్రిప్‌ను అందించే బాధ్యతను ఏపీఎంఐపీకి ప్రభుత్వం అప్పగించింది. ఇదీ పరిస్థితి.... పండ్ల మొక్కలు నాటిన రైతులందరికీ డ్రిప్ అందజేయాలి. ఇది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పటివరకు 1,108 మంది రైతులకు చెందిన 2,617 ఎకరాల్లో మాత్రమే సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు అధికారులు డ్రిప్ ఏర్పాటు చేశారు. మిగిలిన 809 మంది రైతులకు చెందిన 1,783 ఎకరాల్లో డ్రిప్ అమర్చడం మరిచి పోయారు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. రేపు మాపు అంటున్నారే తప్ప మంజూరు చేసిన పాపానపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్న మొక్కలు మొక్కల్ని బతికించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. నీరందక పోవడంతో ఏడాది క్రితం నాటిన మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. పలుచోట్ల వందల కొద్ది మొక్కలు ఎండిపోయాయి. ఎండిన మొక్కల స్థానంలో కొందరు రైతులు తిరిగి మొక్కలు నాటుకున్నారు. డిప్ అందజేస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. తీరా వేసవి ప్రవేశించినా అంద లేదు. బిందెలతో మొక్కలకు నీరుపోశారు. సుదూర ప్రాంతం నుంచి నీరు మోసుకొచ్చి కాపాడుకున్నారు. ఇందుకోసం కొందరు డబ్బులు చెల్లించి కూలీలను పెట్టుకున్నారు. ఈ భారం భరించలేక పలువురు స్వతహాగా నీరు పోశారు. అయినా కొన్ని మొక్కలు బతకలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా డ్రిప్ అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. డ్రిప్ మరిచారు ఉపాది హమీ పథకం కింద 300 నిమ్మ మొక్కలు ఇచ్చారు. వీటిని నాకున్న 4 ఎకరాల్లో పోయిన ఏడాది నాటాను. మొక్కలతో పాటు డ్రిప్ సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంది. డ్రిప్ ఇవ్వకపోవడంతో దాదాపు 100 మొక్కలకు పైనే ఎండిపోయాయి. ఎండాకాలంలో వడగాలులకు బిందెలతో నీరు పోశాం. కొన్ని మొక్కలు ఎలాగోలా బతికాయి. కొన్ని కళ్ల ముందే ఎండిపోయాయి. డ్రిప్ మంజూరు చేయాలని అధికారులు చుట్టూ చాలాసార్లు తిరిగిన. అయినా ఇంతవరకు డ్రిప్ ఇవ్వలేదు. - దిండుగాల లక్ష్మయ్య, రైతు, నోముల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం మా ఊర్లో కొంత మందికి డ్రిప్ ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు. మేమంతా నల్లగొండ ఆఫీసుకు పలుమార్లు పోయాం. ఐదెకరాలలో ఉపాధి హమీ పథకం కింద నిమ్మ మొక్కలు నాటాను. ఏడాది దాటినా డ్రిప్ సౌకర్యం ప్రభుత్వం కల్పించ లేదు. వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాం. నిన్నమొన్న రోజుకు నలుగురు కూలీలతో మొక్కలకు నీరు పోయించాం. ఇందుకోసం అయినా నీరందక 120 పైనే మొక్కలు ఎండిపోయాయి. ఇటీవల వర్షాలు పడితే నీళ్లు పోయడం బంద్ చేశాం. ప్రభుత్వం మొక్కలు ఇవ్వకుంటే ఇతర పంటలైన పండించుకునే వాళ్లం. దీంతో కొంతైనా లాభపడే వాళ్లం. - ముసుగు శంభులింగారెడ్డి, నోముల