న్యూఢిల్లీ: ఈదర హరిబాబుకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఎత్తివేస్తూ ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీ పీఠంపై కేసు తేలేదాకా వైఎస్ చైర్మనే ఇంఛార్జ్ ఛైర్మన్గా కొనసాగుతారని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఈదర హరిబాబు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హరిబాబుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అన్నీ సజావుగా జరిగితే ఒంగోలు జెడ్పీ చైర్మన్గా హరిబాబు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో ఈదరకు ఊరట
Published Tue, Sep 15 2015 1:45 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement