
సీఎం చొక్కా పట్టుకుంటా!
వికారాబాద్‌కు అన్యాయం జరిగితే ఊరుకోను: రేవంత్‌రెడ్డి
తాండూరు: కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరిగితే సీఎం చొక్కా పట్టుకొని నిధులు తీసుకొస్తానని చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి వికారాబాద్‌లో విలీనం చేసి, రేవంత్‌రెడ్డిని ఓడించాలనుకోవడం కేసీఆర్ వక్రబుద్ధికి నిదర్శనమని చెప్పారు. కొడంగల్‌ను ముక్కలు చేసినంతా మాత్రాన రేవంత్‌రెడ్డి ఓడిపోతాడా? అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.