గుంటూరు: నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇప్పటివరకూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మండిపడ్డారు. బాబూరావు అనే వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉండి, ఆయన చేస్తున్న చేష్టల వల్ల రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ నిర్ణయించిందన్నారు. జరుగుతున్న తప్పులను అరికట్టేందుకు సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్ స్వయంగా బాధ్యుడైనా వీసీ ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మేం గట్టిగా అడిగితే ఫిర్యాదు చేశారు. చర్య తీసుకోకపోతే.. తీవ్రస్థాయిలో ఆందోళన ఉంటుంది
-గౌతం రెడ్డి
'వాస్తవాలను వక్రీకరించారు'
Published Thu, Aug 6 2015 2:49 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement