భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న తొమ్మిది దుకాణాలతో పాటు రెండు ఇళ్లలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. స్థానిక గంజిమార్కెట్‌లోని మూడు కిరాణం, రెండు ట్రాన్స్‌పోర్టు, రెండు కమీషన్ ఏజెంట్, రెండు ఆయిల్ మిల్లుల షట్టర్‌లు పగలగొట్టిన దొంగలు నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
మార్కెట్‌కు సమీపంలోనే ఉన్న కిసాన్ నగర్‌లోని రెండు ఇళ్లలోకి చొరబడిన దుండగులు ఇళ్లలోని నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలతో తనిఖీలు చేపడుతున్నారు.