మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ
Published Mon, Jul 25 2016 3:27 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
మహాముత్తారం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయంలో దొంగలు పడి రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ స్ట్రాంగ్ రూం(లాకర్)ను ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేసిన దుండగులు అది సాధ్యపడకపోవడంతో, డెస్క్‌లో ఉన్న రూ. 20 వేలతో ఉడాయించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement