భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం రెస్ట్ హౌస్ రోడ్‌లో సుంకర బద్దయ్యగారి వీధిలో బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ గురువారం అర్ధరాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు మాంసం కొట్టే కత్తితో రామకృష్ణను నరికి చంపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.