మద్యం మత్తులో స్నేహితుల అఘాయిత్యం | man murdered by his friends | Sakshi
Sakshi News home page

తలపై బండరాయితో బాది హత్య!

Published Tue, Jan 9 2018 5:09 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

man murdered by his friends - Sakshi

సాక్షి, కర్ణాటక: ఓ వ్యక్తిని మద్యం మత్తులో స్నేహితులే  దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని దేవనహళ్లి రోడ్డులో రఘునాథపురం వద్ద ఉన్న ఇన్ఫోసిటీలో నివసిస్తున్న రవికుమార్‌ కుమారుడు కిరణ్‌ ఆలియాస్‌ గోటు(27) అనే రౌడీ హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. తన స్నేహితులే  కిరణ్‌ తలపై బండరాయితో మోది హత్యను చేసినట్లు సమాచారం. 

మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. కిరణ్‌ స్నేహితుడు అరుణ్‌ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కిరణ్‌ ఇంటికి వచ్చి అతన్ని బయటికి తీసుకువెళ్లాడు. గంట తరువాత అరుణ్‌ మళ్లీ కిరణ్‌ ఇంటికి వచ్చి  కాటు, చిన్ను అనే యువకులతో కిరణ్‌ గొడవపడుతున్నాడని మీరు వెళ్లి  విడిపించడని చెప్పాడు. అయితే కిరణ్‌ తండ్రి ఘటనాస్థలానికి వచ్చేసరికి కిరణ్‌ హత్యకు గురయ్యాడు. అప్పటికే అఘాయిత్యానికి పాల్పడ్డ వారు పరారయ్యారు. 

ఘటనాస్థలంలో  మద్యం బాటిళ్లు, తినుబండారాలు ఉండటంతో యువకులు కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో పాత గొడవలకు సంబంధించి మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కిరణ్‌పై 2010లో పోలీసులు కిడ్నాప్, అకారణంగా అమాయకులపై గొడవపడి ఘర్షణపడడం, కళాశాల విద్యార్థినీ విద్యార్థులను బెదిరించి డబ్బులు, మొబైళ్లు లాక్కోవడం లాంటి ఆరోపనలపై రౌడీషీట్‌ తెరిచారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు ననమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement