ఏదీ వ్యవ‘సాయం’ | sagu problems | Sakshi
Sakshi News home page

ఏదీ వ్యవ‘సాయం’

Published Sun, Mar 19 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

sagu problems

  • బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో సరి
  • నిరాశ చెందుతున్న అన్నదాతలు
  •  
    ‘పేరుకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌. కాని మాకు కొత్తగా ఒరిగిందేమీ లేదు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌పై రైతులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌ జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రాయితీలు, సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అరకొర కేటాయింపులు వారిని నిరుత్సాహానికి గురి చేశాయి.
     
    అమలాపురం :
    జిల్లాలో సుమారు 7 లక్షల మంది రైతులున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా జిల్లాలో రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలంటేనే రూ.4 వేల కోట్లు కేటాయించాలి. తొలి విడత, రెండో విడత కలిపి జిల్లాలో రైతులకు సుమారు రూ.580 కోట్లు మించి రుణమాఫీ జరగలేదని అంచనా.
     
    ఇందులోనూ సింహభాగం వడ్డీలకే సరిపోయింది. తాజాగా కేటాయించిన సొమ్ములు చూసి రుణమాఫీ పేరుతో వంచనకు గురయ్యామని రైతులు వాపోతున్నారు.
    జీరో పర్సంట్‌.. జీఓతో సరి
    కోనసీమ రైతులు 90 వేల ఎకరాల్లో సాగు సమ్మె చేసిన సందర్భంగా.. వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ రుణాలు పొందే అవకాశాన్ని సాధించుకున్నారు. దీనిప్రకారం రూ.లక్ష లోపు రుణాలకు అయ్యే వడ్డీని రైతులు కాకుండా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాలి. కానీ, చంద్రబాబు అధికారంలోకివచ్చిన తరువాత ఇది అమలవుతోందో లేదో కూడా తెలియకుండా పోయింది. దీనిపై ఏటా జీఓలు జారీ అవుతున్నాయి తప్ప బ్యాంకులకు ప్రభుత్వం నిధులు జమ చేయడం లేదు. జిల్లాలో డీసీసీబీకి రూ.90 కోట్లు, ఇతర వాణిజ్య బ్యాంకులకు రూ.130 కోట్లు కలిపి రూ.220 కోట్ల మేర జీరో పర్సంట్‌ వడ్డీ రాయితీ సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ఒక్క మన జిల్లాలోనే ఇంత వడ్డీ రాయితీ పెండింగ్‌లో ఉండగా.. ఈ బడ్జెట్‌లో రాష్ట్రమంతా కలిపి కేటాయించింది రూ.172 కోట్లు మాత్రమే. ఈ కేటాయింపు వల్ల జిల్లాకు మహా అయితే రూ.15 కోట్లు మాత్రమే వస్తుంది. అంటే పదో వంతు రైతుల రుణాలకు కూడా వడ్డీ రాయితీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించదన్నమాట. ఈ పరిస్థితుల్లో కొత్తగా రుణాలేమిస్తారనే ప్రశ్నకు సమాధానమే లేదు. ఇక పావలా వడ్డీ రాయితీకి రాష్ట్రవ్యాప్తంగా కేటాయించింది కేవలం రూ.5 కోట్లే కావడం మరింత విడ్డూరం.
    సాగునీటికి అరకొరే..
    l జిల్లాకు ప్రయోజనం చేకూర్చే పోలవరం సహా డెల్టా, ఏలేరు ఆధునికీకరణకు అరకొర నిధులు మాత్రమే కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పోలవరానికి గడచిన మూడేళ్లలో కేంద్రం ఇచ్చింది రూ.2 వేల కోట్లే. ఈ బడ్జెట్‌లో రూ.6,889 కోట్లు కేటాయించగా, ఎంత ఖర్చు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
    l కీలకమైన గోదావరి డెల్టా ఆధునికీకరణకు అధికారులు రూ.135 కోట్లతో 336 పనులకు అనుమతి కోరగా, రూ.85.25 కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఏడాది కూడా ఇంతే మొత్తం కేటాయించగా రూ.50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం గమనార్హం. ఆధునికీకరణ జరగని కారణంగా డెల్టాలో ముంపు నీరు దిగక రైతులు ఖరీఫ్‌కు దూరమవుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు జరగలేదు.
    l రూ.125 కోట్ల ఏలేరు ఆధునికీకరణకు రూ.39.36 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన సాగునీటి ప్రాజెక్టులకు సహితం అరకొరగా మాత్రమే నిధులు కేటాయించారు. గోదావరి డెల్టాకు ముప్పుగా పరిగణించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసిన ప్రభుత్వం.. రూ.1,638 కోట్లతో చేపట్టనున్న పురుషోత్తపట్నం ప్రాజెక్టును మాత్రం శరవేగంతో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
    సేంద్రియానికి ప్రోత్సాహం ఏదీ?
    పెట్టుబడులు భారీగా పెరగడం వల్లే వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని మోహ¯ŒSకందా కమిటీ సిఫారసు మేరకు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కోనసీమలో సేంద్రియ సాగు ప్రోత్సాహనికి నిధులు మంజూరు చేసింది. ఆ ఏడాది సుమారు 5 వేల ఎకరాల్లో సాగు చేయించింది. మంచి ఫలి తాలు కూడా వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దీని ఊసే లేకుండా పోయింది. ఈ ఏడాది బడ్జెట్‌లో దీనికి రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో మన జిల్లాకు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్నార్థకం.
    ఉద్యాన రైతుల నిట్టూర్పు
    l మత్స్యశాఖ కేటాయింపుతో పోల్చుకుంటే ఉద్యాన శాఖకు ఇచ్చింది దానిలో సగమే. జిల్లాలో నర్సరీతోపాటు ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. కానీ అరకొర కేటాయింపులవల్ల ఈ పంటల ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంది.
    l వరి తరువాత కీలకమైన కొబ్బరికి ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు. సెంట్రల్‌ ప్లాంటేష¯ŒS క్రాప్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీపీసీఆర్‌ఐ) ఇక్కడ ప్రాంతీయ పరిశోధన కేంద్రం, కోకోనట్‌ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చినా.. బడ్జెట్‌లో వాటికి మౌలిక సదుపాయల కల్పనకు నిధుల ఊసే లేదు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement