నేటి నుంచి ‘సాక్షి-ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్ | sakshi arena youth fest seond edition start on december 5 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘సాక్షి-ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్

Published Mon, Dec 5 2016 4:06 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

నేటి నుంచి ‘సాక్షి-ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్ - Sakshi

నేటి నుంచి ‘సాక్షి-ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్

‘సాక్షి -ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్ రెండో ఎడిషన్ మన ముందుకొచ్చింది.

  • సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో ఉదయం పది గంటలకు ప్రారంభం
  • 22 వరకు జరిగే పోటీల్లో 275 కళాశాలల నుంచి 4,500 మంది పోటీ
  • ఫెస్ట్‌లో తొలిరోజు క్రికెట్ పోటీలు
  • సాక్షి, హైదరాబాద్: యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘సాక్షి -ఎరీనా వన్’యూత్‌ఫెస్ట్ రెండో ఎడిషన్ మన ముందుకొచ్చింది. మేడ్చల్ రోడ్డు కండ్లకోయ గ్రామంలోని సీఎంఆర్ గ్రూప్ సంస్థల్లో సోమవారం ఉదయం పది గంటలకు ఈ ఫెస్ట్ ప్రారంభం కానుంది. డిసెంబర్ ఐదు నుంచి 22 వరకు జరిగే వివిధ పోటీల్లో 275 కళాశాలలకు చెందిన 4,500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. హోండా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫెస్ట్‌లో సాహిత్యం, నృత్యం, టేబుల్‌టెన్నిస్, క్రికెట్, క్యారమ్స్, చెస్, కబడ్డీ, రోబోటిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, సింగింగ్ పోటీల్లో యువతీ యువకులు తమ సత్తా చాటేందుకు సిద్ధ మవుతున్నారు.

    ఈ పోటీలకు బషీర్‌బాగ్ కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కుత్బుల్లాపూర్ దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజనీ రింగ్ కాలేజి, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం, కొంపల్లిలోని శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్, సుచిత్రలోని లయోలా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, అమీర్‌పేటలోని ఎంసీహెచ్ బ్యాడ్మింటన్ కోర్టులు వేదికకానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement