సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు ఈనెల 8న | sakshi -mytri investers club Convention on 8th | Sakshi
Sakshi News home page

సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు ఈనెల 8న

Published Fri, Jan 6 2017 10:43 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

sakshi -mytri investers club Convention on 8th

కరీంనగర్‌లో ఏర్పాటు... ప్రవేశం ఉచితం
హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో : పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మరి ఏ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ రంగంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయి? ఇలా ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల నిర్వహణ, స్టాక్‌ మార్కెట్స్‌ వంటి సమస్త సమాచారాన్ని అందించేందుకు ‘సాక్షి–మైత్రి ఇన్వెస్టర్‌ క్లబ్‌ సదస్సు’ ఈసారి కరీంనగర్‌లో జరుగుతోంది. ఈనెల 8న కరీంనగర్‌లో ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న కిమ్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో జరగనుంది.

ఈ సదస్సులో సీడీఎస్‌ఎల్‌ రీజనల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ వెనిశెట్టి, కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ జి.తిరుమల్‌రెడ్డి, కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ జోనల్‌ బ్రోకింగ్‌ హెడ్‌ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అరవింద్‌ వింజమూరి వక్తలుగా పాల్గొంటారు. ప్రవేశం ఉచితం. సభ్యత్వ నమోదు కోసం 95055 55020 నంబర్‌లో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement