40 రోజులు.. అవే బాధలు
అనంతపురం అగ్రికల్చర్: నగదు కష్టాలకు ఆదివారంతో నలభైరోజులు పూర్తయింది. కాలం గడచిపోతున్నా కష్టాలు మాత్రం కొంచెం కూడా తగ్గకపోవడంతో ’అనంత’ జనం అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ రోజనై..ఎప్పుడు చూసినా అవే బారులు కనిపిస్తన్నాయి. ఎవరిని కదిలించినా అవే బాధలు ఏకరువు పెడుతున్నారు.
అత్యవసరాలకు డబ్బు లేక అవస్థలు
నోట్ల రద్దు తర్వాత రైతులు, కూలీలు, పేదలు, సామాన్యులు, చిరువ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, పెన్షనర్లు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు బ్యాంకులు, ఏటీఎం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగుతున్నా, డబ్బులు అందకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీస అవసరాలు, ఆరోగ్య సమస్యలు, వివాహాది శుభకార్యాలు, చదువులకు ఇతరాత్రా అత్యవసరాల కోసం డబ్బు లభించక అల్లాడిపోతున్నారు.
10 శాతం కూడా
పనిచేయని ఏటీఎంలు
నగదు సరఫరా మందకొడిగా ఉండటంతో జిల్లాలో ఉన్న 34 ప్రిన్సిపల్ బ్యాంకులు, వాటి పరిధిలో ఉన్న 455 శాఖలు సక్రమంగా పనిచేయడం లేదు. అలాగే 556 ఏటీఎంలలో 10 శాతం కూడా తెరచుకోవడం లేదు. వచ్చిన డబ్బును బ్యాంకర్లు ఎంత సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నగదు రహిత లావాదేవీలు అంటూ ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్లడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాటి గురించి ఓనమాలు కూడా తెలియని వారు ఎక్కువగా ఉండటంతో ఆందోâýæన వ్యక్తమవుతోంది.
రూ.150 కోట్ల నగదు సరఫరా
ఆదివారం జిల్లాల్లో ఉన్న కరెన్సీ చెస్ట్‌లకు రూ.150 కోట్ల నగదు సరఫరా అయినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు తెలిపాయి. అందులో రూ.40 కోట్లు ఎస్‌బీఐ చెస్ట్‌కు చేరినట్లు ఆర్‌ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. చెల్లింపులు ఎక్కువగా ఉన్నందున రెండు మూడు రోజుల్లో ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.