
సింధు విజయంతో ఆత్మస్థైర్యం ఏర్పడింది
అనంతపురం సప్తగిరి సర్కిల్: సింధు సాధించిన విజయం అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని శాప్ ఎండీ రేఖారాణి తెలిపారు. సోమవారం స్థానిక క్రీడామైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.200 కోట్లు బడ్జెట్ వచ్చిందన్నారు. రెండు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీల విజేతలకు, 14 మంది జాతీయ క్రీడాకారులను ఆమె సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషా మొహిద్దీన్, కోచ్‌లు, పీఈటీలు పాల్గొన్నారు.