రెండు నెలల్లో సత్యగిరికి బస్సులు ఏర్పాటు | satyagiri bus facilities | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో సత్యగిరికి బస్సులు ఏర్పాటు

Published Tue, Oct 18 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

satyagiri bus facilities

  • దేవస్థానం అధికారులకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రసాద్‌ ఆదేశం 
  • సాక్షి ఎఫెక్టు...
  • అన్నవరం:  
    దేవస్థానంలోని సత్యగిరిపై ఉన్న ‘హరిహర సదన్‌’ సత్రానికి భక్తులు చేరుకునేందుకుగాను రత్నగిరి నుంచి రెండు ఉచిత బస్సులను నడపాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ బస్సులు 24 గంటలు తిరుగుతూ రత్నగిరి, సత్యగిరి మీదనున్న అన్ని సత్రాలు, అన్నదానం, బుకింగ్‌కౌంటర్, ఆలయ మార్గం, రాజగోపురాలు, బస్టాప్‌ తదితర చోట్ల ఆగేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం ఆయన దేవస్థానానికి వచ్చి సత్యగిరిపై పర్యటించారు. ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సత్తెన్నా..సత్రానికి చేరేదెలా...’ కథనానికి ఆయన స్పందించి, సత్యగిరిని సందర్శించారు. సత్యగిరిపై ఉన్న హరిహరసదన్‌ సత్రంలో భక్తులు ఎక్కువ మంది బస చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అలా చేయకుండా కేవలం కార్లు ఉన్నవారికే ఈ సత్రంలో గదులు కేటాయిస్తున్నామని చెప్పడం సరైన సమాధానం కాదని తెలిపారు. ప్రస్తుతం ఆ సత్రంలో  30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందని, దానిని కనీసం 80 శాతానికి పెంచాలంటే రత్నగిరి, సత్యగిరి మధ్య ఉచిత బస్సులు నడపాలని ఆదేశించారు. ఆ బస్సుల్లో ఒక దాన్ని తిరుమలలో తిరిగే రథం మాదిరిగాను, మరొకటి డబల్‌డెక్కర్‌గా ఉండేలా చూడాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఈ బస్సులు ఏర్పాటు చేసి, బస్టాప్‌ల వద్ద షెల్టర్స్, బోర్డులు రూపొందించాలన్నారు. ఈ పనులను మారుతి కన్సల్టెన్సీ అధినేత కృష్ణన్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రసాద్‌ అప్పగించారు. అలాగే హరిహర సదన్‌ సత్రంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి ఆ షాపుల్లో అన్ని రకాల వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement